వాయనాడ్‌(Wayanad) విధ్వంసం ఊహించిందే! కొన్నేళ్లుగా పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా, నివేదికలు ఇచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.

వాయనాడ్‌(Wayanad) విధ్వంసం ఊహించిందే! కొన్నేళ్లుగా పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా, నివేదికలు ఇచ్చినా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దాని ఫలితమే ఈ పెను విపత్తు. ఇంత మంది ప్రాణాలు కోల్పోడానికి కారణమైన ఆ ఉపద్రవం మనిషి చేసిందే! పర్యావరణవేత్తలకే కాదు, చిన్నపిల్లలకు కూడా కొండలను కొల్లగొడితే ఏం జరుగుతుందో తెలుసు. వాయనాడ్‌లో జరిగిన విధ్వంసాన్ని అక్కడే ఎనిమిదో తరగతి చదువుతున్న ఓ బాలిక ఏడాది క్రితమే ఊహించింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న లయ(Laya) అనే విద్యార్థిని ఓ కథ రాసింది.ఆ కథ ఏడాది కిందట స్కూల్ మాగజైన్‌లో(school magazine) ప్రచురించారు కూడా! లయ రాసిన కథలో ఓ అమ్మాయి జలపాతంలో మునిగిపోయి చనిపోతుంది. చనిపోయిన ఆ అమ్మాయి పక్షిగా మళ్లీ పుడుతుంది. గ్రామానికి తిరిగివస్తుంది. ఆ పక్షి ఊరి పిల్లలకు హెచ్చరిక చేస్తుంది. 'పిల్లల్లారా.. ఈ ఊరి నుంచి పారిపోండి..ఇక్కడ పెను ప్రమాదం సంభవించబోతున్నది' అని ఆ పక్షి చెబుతుంది. ఆ పిల్లలు వెనక్కి తిరిగి చూసేసరికి కొండపై నుంచి వర్షపు నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ కిందకు వెల్లువలా వస్తుంటుంది. అలా చెప్పిన ఆ పక్షి అందమైన అమ్మాయిగా మారిపోతుంది. కాని అప్పుడు గ్రామస్తులను రక్షించడానికి ఎవరూ రారు. అందరూ మునిగిపోతారు. ఇప్పుడు చరమల కూడా కొండ చరియల విధ్వంసంలో మునిగిపోయింది. విషాదమేమింటే ఆ కథ రాసిన లయ తండ్రి లెనిన్‌ కూడా ప్రాణాలు కోల్పోవడం. లయ చదువుతున్న పాఠశాలలో 497 మంది విద్యార్థుల్లో 32 మంది చనిపోయారు. ఇద్దరు విద్యార్థులు వారి తండ్రి, తోబుట్టువులను కూడా కోల్పోయారు. బడి కూడా పూర్తిగా ధ్వంసమైంది. స్కూల్‌ హెడ్‌మాస్టర్‌ వి ఉన్నికృష్ణన్, ఇతర టీచర్లు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.



Updated On 4 Aug 2024 7:49 AM GMT
Eha Tv

Eha Tv

Next Story