ఐపీఎల్ టోర్నమెంట్‌(IPL 2023) నిబంధనల్లో చిన్నపాటి మార్పు జరిగింది. ఇకపై ఐపీఎల్‌ కెప్టెన్లు టాస్‌ వేసిన తర్వాత కూడా ఫైనల్‌ టీమ్‌ను ప్రకటించవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రూల్స్‌ ప్రకారం కెప్టెన్లు టాస్‌కు ముందే ఫైనల్‌ టీమ్‌ వివరాలను ప్రకటించాలి. ఇరు జట్ల కెప్టెన్లు ఫైనల్‌ ఎలవెన్‌తో కూడిన జట్టునే కాకుండా అయిదుగురు సబ్‌స్టిట్యూట్ల వివరాలను టాస్‌ తర్వాత కూడా ఐపీఎల్‌ మ్యాచ్‌ రిఫరీ(Ipl Match Referee)కి అందించవచ్చు. ముందు తుది జట్టును వెల్లడించినప్పటికీ మ్యాచ్‌ మొదలు కావడానికి ముందు ప్రత్యర్థి కెప్టెన్‌ అనుమతి లేకుండా జట్టులో మార్పులు చేసుకోవచ్చు అని బీసీసీఐ పేర్కొంది

Updated On 23 March 2023 3:28 AM GMT
Ehatv

Ehatv

Next Story