కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పెద్ద షాక్ ఇచ్చింది. NCERT సిలబస్(Syllabus) లో కొన్ని చాఫ్టర్స్ ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ వ్యతిరేకించింది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పెద్ద షాక్ ఇచ్చింది. NCERT సిలబస్(Syllabus) లో కొన్ని చాఫ్టర్స్ ని తొలగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కేరళ వ్యతిరేకించింది. వ్యతిరేకించడమే కాకుండా తొలగించిన చాఫ్టర్స్ ని తిరిగి తమ రాష్ట్రంలో ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అల్లర్లు(Gujarat Dissputes), మహాత్మా గాంధీ హత్య(assassination Of mahathma gandhi), పండిట్ నెహ్రు(Pandit Nehru) పాలనలో భారత్ వంటి చాఫ్టర్లు NCERT సిలబస్ నుంచి తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఈ నిర్ణయం పై కేరళ కరికులం కమిటీ సమావేశం అయింది. NCERT స్కూల్ సిలబస్ నుంచి భారీగా చాఫ్టర్స్ తొలగింపు పై చర్చించి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఒక సబ్ కమిటీ వేసింది. ఈ అంశం పై పలు దఫాలుగా సమావేశం నిర్వహించి, కేంద్ర ప్రభత్వం తొలగించిన పాఠ్య అంశాలను సిలబస్ లో పెట్టి విద్యార్థులకి భోదించాలని నిర్ణయానికి వచ్చి తమ రిపోర్ట్ ని కేరళ జనరల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి పంపింది. సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని కేరళ ఎడ్యుకేషన్ మినిస్టర్ శివకుట్టి మీడియా కి వెల్లడించారు.
తొలగించిన చెప్తేర్స్ ని మళ్ళి చేరుస్తు కొత్త పుస్తకాలూ ఇప్పటికే ప్రింట్ అయ్యాయని, ఓనం సెలవుల తరవాత పుస్తకాలూ విద్యార్థులకి పంపిణి చేస్తామని, అంతే కాకుండా ఈ సంవత్సర ఫైనల్ పరీక్షలకి ఈ చాఫ్టర్స్ కి సంబంధించిన ప్రశ్నలను పొందుపరుస్తామని కూడా మంత్రి శివకుట్టి(Minister sivankutti) చెప్పారు.
గుజరాత్ అల్లర్లు, మొఘల్ పరిపాలన, భారత్ లో ఎమర్జెన్సీ విధింపు, నక్సలైట్ ఉద్యమం, డార్విన్ సిద్ధాంతం లాంటి అంశాలని సిలబస్ నుంచి తొలగించడమే కాకుండా, పదో తరగతి సిలబస్ నుంచి పీరియాడిక్ టేబుల్, డెమోక్రసీ, సోర్స్ అఫ్ ఎనర్జీ చాఫ్టర్స్ కూడా తొలగిస్తూ నేషనల్ కౌన్సిల్ అఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) జూన్ 2023 లో తీసుకున్న నిర్ణయం పై బీజేపీ యేతర రాష్ట్రాలలో వ్యతిరేకత ఏర్పడింది.