ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విష‌య‌మై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్‌ను శనివారం విచారణకు పిలిచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు విష‌య‌మై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్‌ను శనివారం విచారణకు పిలిచినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. నజాఫ్‌గఢ్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే గహ్లోట్ (49) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంలో రవాణా, హోం మరియు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు.

మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద ఈ కేసులో విచారణకు హాజరుకావాలని.. అతని స్టేట్‌మెంట్‌ను నమోదు చేసుకోవాలని గహ్లాట్‌ను కోరినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. 2021-22కి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో.. అమలు చేయడంలో అవినీతి, మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఆ తర్వాత పాల‌సీ రద్దు చేసిన‌ప్ప‌టికి.. కేసు విచార‌ణ జ‌రుగుతుంది. ఈ కేసులో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను గతంలోనే ఈడీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

Updated On 30 March 2024 12:22 AM GMT
Yagnik

Yagnik

Next Story