ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ నాలుగో సమన్లు జారీ చేసింది. ఈ కేసులో జనవరి 18న విచారణకు హాజరు కావాలని సీఎంను ఆదేశించింది.

ED summons Delhi CM Arvind Kejriwal for 4th time in excise policy case
ఢిల్లీ మద్యం కుంభకోణంలో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Aravind Kejriwal)కు ఈడీ(Enforcement Directorate) నాలుగో సమన్లు జారీ చేసింది. ఈ కేసులో జనవరి 18న విచారణకు హాజరు కావాలని సీఎంను ఆదేశించింది. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది.. కానీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ ముందు హాజరు కాలేదు. మూడుసార్లు సమన్లను ధిక్కరించడంతో ఈడీ కేజ్రీవాల్‌ను అరెస్టు(Arrest) చేస్తుందని అంతా భావించారు. కానీ మరోసారి సమన్లు జారీ చేసింది.
జనవరి 3న అరవింద్ కేజ్రీవాల్‌కు మూడోసారి సమన్లు పంపగా.. ఆ నోటీసులను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. దీంతో ఆయనపై ఈడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ మూడు సార్లు సమన్లను పంపించిన పట్టించుకోలేదు ఇది చట్టవిరుద్ధమని ఆరోపించారు.
ఈడీ ఇప్పటి వరకు కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్ 2, డిసెంబర్ 21, ఈ ఏడాది జనవరి 3న విచారణలో పాల్గొనాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. తొలి సమన్ల సమయంలో కేజ్రీవాల్ ఎన్నికల సమావేశానికి వెళ్లగా.. రెండోసారి విపాసన కోసం వెళ్లారు.. మూడో సారి నోటీసులను పట్టించుకోలేదు. దీంతో నాలుగోవ సారి సమన్లు(ED summons) జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన తప్పకుండా ఈడీ ముందుకు రావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొంది.
