మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు(Mahadev Betting App Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూడుకు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే రణబీర్ కపూర్(Ranbir Kapoor)కు ఈడీ సమన్లు పంపింది. ఇప్పుడు ఈ కేసులో బాలీవుడ్ నటులు హుమా ఖురేషి(Huma Qureshi), కామెడీ కింగ్ కపిల్ శర్మ(Kapil Sharma), హీనా ఖాన్(Hina Khan)లకు సమన్లు జారీ చేసింది.

Mahadev Betting App Case
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు(Mahadev Betting App Case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దూడుకు పెంచింది. ఈ కేసులో ఇప్పటికే రణబీర్ కపూర్(Ranbir Kapoor)కు ఈడీ సమన్లు పంపింది. ఇప్పుడు ఈ కేసులో బాలీవుడ్ నటులు హుమా ఖురేషి(Huma Qureshi), కామెడీ కింగ్ కపిల్ శర్మ(Kapil Sharma), హీనా ఖాన్(Hina Khan)లకు సమన్లు జారీ చేసింది. ఈ కేసులో సాక్షుల హోదాలో ముగ్గురు నటులను విచారించనున్నట్టు సమాచారం. వీరు ముగ్గురు బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. ఇందుకోసం వీరు డబ్బును కూడా పుచ్చుకున్నారట!యాప్ ప్రమోటర్ సౌరబ్ చంద్రకర్ పెళ్లికి కపిల్ శర్మ హాజరయ్యారని ఈడీ గుర్తించింది. అయితే ఇప్పటికే అక్టోబర్ 6వ తేదీన అధికారుల ముందు హాజరు కావాలని నటుడు రణబీర్ కపూర్‌కు ఈడీ సమన్లు పంపింది. అయితే ఈడీ ముందు హాజరయ్యేందుకు తనకు రెండు వారాల మినహాయింపు కావాలని రణబీర్ కపూర్ అభ్యర్థించారట! అతని అభ్యర్థనపై ఈడీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మహదేవ్ యాప్‌కి సంబంధించిన ప్రమోషన్ల కోసం అతను అందుకున్న డబ్బు, అతనితో కాంటాక్ట్‌లో ఉన్న వ్యక్తుల గురించి వివరణ కోరాలని ఈడీ భావిస్తోంది.
మహాదేవ్ బుక్ యాప్ అనేది ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా అక్రమంగా మనీలాండరింగ్ కార్యకలాపాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రకర్(Saurabh Chandrakar) ఫిబ్రవరి 2023లో దుబాయ్(Dubai)లో తన వివాహ వేడుక కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. ఈ పెళ్లికి బాలీవుడ్ ప్రముఖులు టైగర్ ష్రాఫ్(Tiger Shroff), సన్నీలియోన్(Sunny Leone), నేహా కక్కర్(Neha Kakkar), విశాల్ దద్లానీ(Vishal Dadlani), ఎల్లి అవ్రామ్(Elli AvrRam), భారతీ సింగ్, భాగ్యశ్రీ, కృతి కర్బందా, నుష్రత్ భరుచ్చా, అతీఫ్ అస్లాం, రహత్ ఫతే అలీ ఖాన్, అలీ అస్గర్, కృష్ణ, అభిషేక్ సుఖ్విందర్ సింగ్ హాజరయ్యారు. చంద్రాకర్.. మరో ప్రమోటర్ రవి ఉప్పల్‌తో కలిసి ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్‌ల ముసుగులో బినామీ ఖాతాల ద్వారా మనీలాండరింగ్ చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
