జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్(Sanjeev) ఇంట్లో గుట్టలుగుట్టలుగా పడి ఉన్న నోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో వరుసుగా దాడులు నిర్వహించిన ఈడీ.. తన సోదాల్లో లెక్క చూపని 25 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది.
జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్(Sanjeev) ఇంట్లో గుట్టలుగుట్టలుగా పడి ఉన్న నోట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. జార్ఖండ్ రాజధాని రాంచీలో వరుసుగా దాడులు నిర్వహించిన ఈడీ.. తన సోదాల్లో లెక్క చూపని 25 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఇటీవల నిర్వహించిన దాడులు, జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతనికి సంబంధించిన ఆరు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి వీరేంద్ర రామ్‌ను ఫిబ్రవరి 2023లో ED అరెస్టు చేసింది. రాంచీలోని సెయిల్ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ ఏకకాలంలో దాడులు నిర్వహిస్తోంది. రోడ్డు నిర్మాణ విభాగానికి చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం సెయిల్ సిటీలో ఈడీ గాలింపు చేపట్టింది. మరో ఈడీ బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది. 70 ఏళ్ల ఆలంగీర్ ఆలం కాంగ్రెస్ నాయకుడు, జార్ఖండ్ అసెంబ్లీలో పాకూర్ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ డబ్బును ఎన్నికల్లో ఖర్చు చేయడానికి కాంగ్రెస్(congress) ప్రయత్నిస్తోందని.. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేవ్ డిమాండ్ చేశారు.