మద్యం కుంభకోణం కేసులో అనేక మలుపులు. అనూహ్య పరిణామాలు. ప్రీ క్లయిమాక్స్‌ సినిమాలో ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఈ కేసులోనూ అనే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ ఈడీ ముందు ఎమ్మెల్సీ కవిత హాజరుకాకపోవడంతో ఈడీ ఆమెకు మళ్లీ నోటీసులు పంపింది. ఈ నెల 20న విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. దీంతో ఈడీ నోటీసులపై మళ్లీ ఉత్కంఠ మొదలయ్యింది.

ఇక ఇదే స్కామ్‌ కేసులో ఈడీ అధికారులు రామచంద్ర పిళ్లైను రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పిళ్లైకు మూడు రోజుల పాటు కస్టడీని పొడిగించింది కోర్టు. పిళ్లైను కవితతో పాటు విచారించాల్సి ఉందని కోర్టుకు ఈడీ విన్నవించుకుంది. పిళ్లైని కవితతో పాటు విచారించాల్సి ఉందని, ఇవాళ కవిత విచారణకు హాజరు కాకపోవడంతో పిళ్లై కస్టడీని పొడిగించాలని కోరింది. ఈడీ వినతికి కోర్టు మన్నించింది.

ఉదయం నుంచి ఢిల్లీలో ఉత్కంఠభరిత వాతావరణం చోటు చేసుకుంది. విచారణకు హాజరుకావాల్సిన కవిత తాను రాలేనని ఈడీ అధికారులకు తెలిపారు. తన తరఫు న్యాయవాది సోమా భరత్‌తో సమాచారం పంపారు. ఈడీ విచారణపై స్టే ఇవ్వాలని తాను వేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ఈడీకి రాసిన ఆరు పేజీల లేఖలో కవిత పేర్కొన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో విచారణ జరపడం మంచిది కాదని, ఈ పరిస్థితులలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయండి అంటూ కవిత రిక్వెస్ట్‌ చేశారు. మహిళను ఈడీ కార్యాలయానికి విచారణకు పిలవచ్చా అనే అంశం కూడా కోర్టులో పెండింగ్‌లో ఉందని కవిత తెలిపారు. చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటానని లేఖలో కవిత వివరించారు.

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story