లోక్‌సభలో ఈడీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభలో ఈడీ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేసేందుకు సిద్ధమవుతోందని రాహుల్ అన్నారు. దీని వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆయన వివరించారు. పార్లమెంటులో నేను చేసిన చక్రవ్యూహం ప్రసంగం తర్వాత నాకు వ్యతిరేకంగా సన్నాహాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 2024 బడ్జెట్‌కు సంబంధించి రాహుల్ తన ప్రసంగంలో బీజేపీ 21వ శతాబ్దపు చక్రవ్యూహాన్ని ప్రస్తావించారు.
నేను పార్లమెంట్‌లో చేసిన ప్రసంగం ఇద్దరిలో ఒకరికి నా చక్రవ్యూహం స్పీచ్ నచ్చలేదని.. అందుకే రైడ్‌కు ప్లాన్ చేస్తున్నట్లు ఈడీ వర్గాలు చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు. రాహుల్ ఈడీని ట్యాగ్ చేస్తూ.. 'నా నుంచి టీ, బిస్కెట్లుతో.. మీకు ముకుళిత హస్తాలతో స్వాగతం' అని రాశారు.
బడ్జెట్‌పై తన ప్రసంగంలో మహాభారతాన్ని ప్రస్తావిస్తూ రాహుల్ చక్రవ్యూహం గురించి మాట్లాడారు. ఆ సమయంలో అభిమన్యుడు ఆరుగురి చక్రవ్యూహంలో చిక్కుకున్నాడని.. 21వ శతాబ్దంలో కూడా భారత్‌పై ఇలాంటి కుట్రను సృష్టించి యువత, రైతులు, మహిళలు, చిన్నకారు రైతులను ఇరికిస్తున్నారు. ఈ చక్రవ్యూహాన్ని ఆరుగురు అంటే పీఎం మోదీ, అమిత్ షా, అజిత్ దోవల్, మోహన్ భగవత్, అదానీ, అంబానీలు నియంత్రిస్తున్నారని అన్నారు. చక్రవ్యూహాన్ని పద్మవ్యూహం అని కూడా పిలుస్తారు. అంటే కమలం. ఈ గుర్తును ఛాతీపై పెట్టుకుని ప్రధాని మోదీ తిరుగుతున్నారని అన్నారు.