ప్రస్తుతం దేశంలో మారిమోగిపోతున్న పేరు సంజయ్‌ కుమార్‌ మిశ్రా. ఎవరీయన? ఏమిటాయన స్పెషాలిటీ? ఆయనపై ఎందుకింత చర్చ ? 1984 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ ఆఫీసర్‌ అయిన సంజయ్‌కుమార్‌ మిశ్రా ప్రస్తుతం ఈడీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 62 ఏళ్ల సంజయ్‌కుమార్‌ ఆర్ధికరంగంలో నిపుణుడు. ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అతి పెద్ద కేసులను, హై ప్రొఫైల్‌ కేసులను విచారించి చట్టం ముందు వారిని దోషులుగా నిలబెట్టిన ఘనుడు.

ప్రస్తుతం దేశంలో మారిమోగిపోతున్న పేరు సంజయ్‌ కుమార్‌ మిశ్రా. ఎవరీయన? ఏమిటాయన స్పెషాలిటీ? ఆయనపై ఎందుకింత చర్చ ? 1984 బ్యాచ్‌ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ ఆఫీసర్‌ అయిన సంజయ్‌కుమార్‌ మిశ్రా ప్రస్తుతం ఈడీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 62 ఏళ్ల సంజయ్‌కుమార్‌ ఆర్ధికరంగంలో నిపుణుడు. ఇన్‌కమ్‌టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో అతి పెద్ద కేసులను, హై ప్రొఫైల్‌ కేసులను విచారించి చట్టం ముందు వారిని దోషులుగా నిలబెట్టిన ఘనుడు. ఈయన విచారణ మామూలుగా ఉండదు.. అందుకే ఆర్ధిక నేరగాళ్లకు ఈయన పేరు చెబితే వెన్నులో సన్నటి వణుకు మొదలవుతుంది. ఆయన ట్రాక్‌ రికార్డు అంత గొప్పగా ఉంది కాబట్టే కేంద్రప్రభుత్వం 2018 నవంబర్‌లో ఈడీ డైరెక్టర్‌గా నియమించింది. ఈయన పనితీరుకు మెచ్చిన కేంద్రం ఈయన సేవలను పొడిగిస్తూ వస్తోంది. ఈయన పదవిని పొడగిస్తూ రావడం పట్ల కాంగ్రెస్‌ అభ్యంతరం తెలిపింది.

సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. కాకపోతే సుప్రీంకోర్టు కాంగ్రెస్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. కానీ మళ్లీ ఎక్స్‌టెన్షన్‌ ఇవ్వడానికి వీలు లేదని తెలిపింది. కొత్తగా వచ్చే అధికారికి వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుందని, అనేక కేసులు ఇప్పుడు వివిధ దశలలో ఉన్నాయి కాబట్టి సంజయ్‌ కుమార్‌ మిశ్రాను డైరెక్టర్‌గా కొనసాగిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. అధికారి సేవలను పొడిగించడం కరెక్టేనని తెలిపింది. ఈయన విచారించిన పెద్దలు ఎందరో ఉన్నారు. సోనియా గాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, రాబర్ట్‌ వాద్రా, డీకే శివకుమార్‌, హేమంత్‌ సోరెన్‌, అనీల్‌దేశ్‌ముఖ్‌, భూపేందర్‌సింగ్‌ హనీ, మనీష్‌ సొసోడియా, తృణమూల్‌ కాంగ్రెస్‌ మాజీ నేత పార్థ చటర్జీ అర్పిత ముఖర్జీ, ఆప్‌ నేత సత్యేంద్ర జైన్‌, మహబూబా ముఫ్తీ, ఫరూఖ్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, యెస్‌ బ్యాక్‌ మాజీ డైరెక్టర్‌ రాణా కపూర్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ మాజీ ఎండీ, సీఈఓ చంద కొచ్చర్‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌ ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డంత మంది. వీరంతా సంజయ్‌కుమార్‌ మిశ్రా ఆధ్వర్యంలోనే విచారణను ఎదుర్కొన్నారు. మిశ్రా ఆర్ధిక నేరగాళ్ల పాలిట సింహస్వప్నం. ఆయనంటే వారికి హడల్‌.

Updated On 16 March 2023 2:20 AM GMT
Ehatv

Ehatv

Next Story