హర్యానాలో(Haryana) ఐదు ఎకరాలకు భూకొనుగోలు, విక్రయం కేసులో తొలిసారి ప్రియాంకాగాంధీ పేరును ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చింది. ఇదే కేసులో ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చింది. ఢిల్లీకి(Delhi) చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ పహవాతో జరిగిన లావాదేవీలపై ప్రియాంకాగాంధీపై(Priyanka Gandhi) ఆరోపణలు వచ్చాయి. ఫరీదాబాద్‌లో(Faridabad) ప్రియాంకాగాంధీ పేరుతో 2006లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని పహవాకు అమ్మేశారు.
హర్యానాలో(Haryana) ఐదు ఎకరాలకు భూకొనుగోలు, విక్రయం కేసులో తొలిసారి ప్రియాంకాగాంధీ పేరును ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చింది. ఇదే కేసులో ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా పేరును కూడా ఛార్జిషీట్‌లో ఈడీ చేర్చింది. ఢిల్లీకి(Delhi) చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ పహవాతో జరిగిన లావాదేవీలపై ప్రియాంకాగాంధీపై(Priyanka Gandhi) ఆరోపణలు వచ్చాయి. ఫరీదాబాద్‌లో(Faridabad) ప్రియాంకాగాంధీ పేరుతో 2006లో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆ ఇంటిని పహవాకు అమ్మేశారు. పహవా నుంచే అదే గ్రామంలో థంపి సుమారు 486 ఎకరాల భూమిని అమిపుర్‌లో కొనుగోలు చేశారు. ఆ గ్రామంలోనే ప్రియాంకా కూడా 40 ఎకరాలు కొన్నది. ఆ తర్వాత 2010లో ఆ స్థలాన్ని మళ్లీ పహవాకే అమ్మేసింది. రాబర్ట్ వాద్రా, థంపికి సంబంధాలు ఉన్నట్లు గత ఛార్జిషీట్లలో ఆరోపించారు.
అయితే ఐదు ఎకరాల కొనుగోళ్ల కేసులో ఛార్జిషీట్‌లో కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంకాగాంధీ పేరును ఈడీ చేర్చింది. ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వద్రా పేరు కూడా ఛార్జిషీట్‌లో పెట్టింది. కానీ ఇద్దర్నీ నిందితులు జాబితాలో చేర్చలేదు. ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త సీసీ థంపి, బ్రిటీష్ ఎన్ఆర్ఐ సుమిత్ చద్దాలపై ఈడీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. మరో వ్యాపారి సంజయ్ భండారికి ఆ ఇద్దరూ హెల్ప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.