ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌(Bhupesh Baghel) రాజకీయ సలహాదారు వినోద్‌ వర్మ(Vinodh Varma) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) బుధవారం సోదాలు(Raids) నిర్వహించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు(Chhattisgarh Assembly Elections) ముందు సీఎం భూపేష్ బఘేల్‌పై ఈడీ చర్య పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌(Bhupesh Baghel) రాజకీయ సలహాదారు వినోద్‌ వర్మ(Vinodh Varma) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) బుధవారం సోదాలు(Raids) నిర్వహించింది. ఈ ఏడాది చివర్లో జరగనున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు(Chhattisgarh Assembly Elections) ముందు సీఎం భూపేష్ బఘేల్‌పై ఈడీ చర్య పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలకు సంబంధించి ఇటీవల కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేసింది.

దాడులపై ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ స్పందిస్తూ.. గౌరవనీయులైన ప్రధాన మంత్రి(Prime Minister), మిస్టర్ అమిత్ షా(amit shah) నా పుట్టినరోజు సందర్భంగా.. నా రాజకీయ సలహాదారు, నా ఓఎస్డీ(OSD), నా సన్నిహితుడి ఇళ్ల‌కు ఈడీని పంపడం ద్వారా మీరు అందించిన అమూల్యమైన బహుమతికి చాలా ధన్యవాదాలు అని ట్వీట్ చేశారు.

Updated On 23 Aug 2023 1:39 AM GMT
Ehatv

Ehatv

Next Story