బ్యాంక్ మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది.
బ్యాంక్ మోసా(Bank Fraud)నికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్(Jet Airways) వ్యవస్థాపకుడు నరేష్ గోయల్(Naresh Goyal)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. ఈ మేరకు ఈడీ అధికారి శుక్రవారం సమాచారం అందించారు. 74 ఏళ్ల గోయల్‌ను శనివారం ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు(PMLA Court) ముందు హాజరుపరచగా.. ఈడీ ఆయనను కస్టడీకి కోరనుందని అధికారి తెలిపారు.
రూ. 538 కోట్ల కెనరా బ్యాంకు(Canara Bank) మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు(Money Laundering Case)లో శుక్రవారం అర్థరాత్రి ఈడీ గోయల్‌ను అరెస్టు(Arrest) చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతకుముందు ముంబై ఈడీ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
జెట్ ఎయిర్‌వేస్ నరేష్ గోయల్, ఆయన భార్య అనితా గోయల్(Anitha Goyal), కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్‌లపై మనీలాండరింగ్ కేసు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కెనరా బ్యాంక్ ఫిర్యాదు మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) గోయల్ దంపతులతో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్(FIR) నమోదు చేసింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు దర్యాప్తు ప్రారంభించింది. బ్యాంకు మోసం కేసులో గోయల్, ఆయన భార్య అనిత, కంపెనీకి చెందిన కొందరు మాజీ అధికారులను సీబీఐ నిందితులుగా పేర్కొంది. జెట్ ఎయిర్‌వేస్ లిమిటెడ్ (JIL)కి రూ.848.86 కోట్ల రుణం ఇచ్చామని.. అందులో రూ.538.62 కోట్లు ఇంకా బకాయిలు ఉన్నాయని బ్యాంకు సీబీఐకి ఫిర్యాదు చేసింది.