దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది.

EC to announce poll schedule for 5 states today
దేశంలోని ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల(Election) నగరా మోగనుంది. ఈ మేరకు సోమవారం ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్(Schedule) విడుదల చేయనున్నట్లు ప్రకటనలో తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నారు అధికారులు. ఈ మేరకు సీఈసీ రాజీవ్‌కుమార్(CEC Rajeev Kumar) మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
ఇదిలావుంటే.. ఈ ఏడాది తెలంగాణ(Telangana), రాజస్థాన్(Rajasthan), మిజోరం(Mizoram), మధ్యప్రదేశ్(Madhya Pradesh), చత్తీస్‌గఢ్(Chhattisgarh)లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ నుంచి డిసెంబర్ వరకు జరగొచ్చని ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
తెలంగాణ, రాజస్థాన్, మిజోరం, మధ్యప్రదేశ్‌లో ఒకే విడతలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చత్తీస్‌గఢ్‌లో మాత్రం రెండు విడతల్లో ఎన్నికలు జరిగే చాన్స్ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. మావోయిస్టుల టెన్షన్ ఉన్న కారణంగా రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై స్పష్టత రావాలంటే మధ్యాహ్నం వరకూ వేచిచూడాల్సిందే.
