Earthquakes : ఇరుగుపొరుగు దేశాలలో భూ ప్రకంపనలు
ఇండియా(India) చుట్టుపక్కల ఉన్న దేశాలలో భూ ప్రకంపనలు(Earth Quakes) చోటు చేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌తో(Pakistan) పాటు చైనా(China), పాపువా న్యూ గినియాలో(Papua New Guinea) కూడా భూకంపం సంభవించింది. భూకంపం రాగానే ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు.
ఇండియా(India) చుట్టుపక్కల ఉన్న దేశాలలో భూ ప్రకంపనలు(Earth Quakes) చోటు చేసుకున్నాయి. మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్‌తో(Pakistan) పాటు చైనా(China), పాపువా న్యూ గినియాలో(Papua New Guinea) కూడా భూకంపం సంభవించింది. భూకంపం రాగానే ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ మూడు దేశాలలో కూడా ఎలాంటి ఆస్తి నష్టము, ప్రాణనష్టము సంభవించలేదు. పాపువా న్యూ గినియాలో తీవ్రస్థాయిలో భూమి కంపించింది. పాకిస్తాన్‌లో ఏర్పడిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదయ్యింది. ఇక చైనాలోని జిజాంగ్‌లో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0 గా నమోదయ్యింది