బీహార్(Bihar)లోని అరారియా(Araria)లో బుధవారం భూకంపం(Earthquake) సంభవించింది. ఉదయం 5.35 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూప్రకంపనలు రాగా.. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) తెలిపింది. భూప్రకంపనలు ధాటికి ఆ ప్రాంతంలోని ప్రజలు నిద్రలేచి తీవ్ర భయాందోళనలతో వారి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు నివేదికలు లేవు. An earthquake of magnitude 4.3 occurred in […]
బీహార్(Bihar)లోని అరారియా(Araria)లో బుధవారం భూకంపం(Earthquake) సంభవించింది. ఉదయం 5.35 గంటల ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూప్రకంపనలు రాగా.. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) తెలిపింది. భూప్రకంపనలు ధాటికి ఆ ప్రాంతంలోని ప్రజలు నిద్రలేచి తీవ్ర భయాందోళనలతో వారి ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు నివేదికలు లేవు.
An earthquake of magnitude 4.3 occurred in Araria, Bihar at around 5.35 am. The depth of the earthquake is 10 Km: National Center for Seismology pic.twitter.com/EyQUP4Wh9X
— ANI (@ANI) April 12, 2023
అంతకుముందు మార్చి 22న ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో భూమి కంపించింది. ప్రకంపనలు రాత్రి 10.22 గంటల ప్రాంతంలో రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.6గా నమోదైంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని హిందూకుష్ ప్రాంతం భూకంప కేంద్రం. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. యూఎస్‌జీఎస్ ప్రకారం.. తుర్క్‌మెనిస్తాన్, ఇండియా, కజకిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిజ్‌స్థాన్‌లలో ప్రకంపనలు సంభవించాయి.