నేపాల్‌లో(Nepal) ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో(Earthquake) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 128 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తెలియదు.

నేపాల్‌లో(Nepal) ప్రకృతి విలయతాండవం చేసింది. భారీ సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. శుక్రవారం రాత్రి సంభవించిన భారీ భూకంపంలో(Earthquake) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 128 మృతదేహాలను వెలికితీశారు. శిథిలాల కింద ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయో తెలియదు. భూకంపం కారణంగా జాజర్కోట్(Jajarkot), రుకుం(Rukum) పశ్చిమ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
నేపాల్‌లోని వాయువ్య జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు అయ్యింది. దేశ రాజధాని ఖాట్మాండుకు 400కి.మీల దూరంలో ఉన్న జజర్‌కోట్‌లో భూకంప కేంద్రం గుర్తించినట్లు నేపాల్‌ జాతీయ భూకంప పర్యవేక్షణ, పరిశోధన కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం 11 మైళ్ల లోతులో ఉన్నట్లు గుర్తించింది. భూకంప తీవ్రతకు ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ప్రజలు రాత్రంతా రోడ్లపైనే గడిపారు. ఉదయం నుంచి సహాయక చర్యలు తీవ్రతరం చేశారు.
అటు ఉత్తర భారతంలోని ఢిల్లీ, పట్నా, లక్నోల్లోనూ భూమి కంపించింది. కానీ ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.

Updated On 4 Nov 2023 12:54 AM GMT
Ehatv

Ehatv

Next Story