మహారాష్ట్రలోని హింగోలిలో సోమ‌వారం ఉద‌యం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్లడించింది.

మహారాష్ట్ర(Maharashtra)లోని హింగోలి(Hingoli)లో సోమ‌వారం ఉద‌యం భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలు(Richter Scale)పై భూకంప తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూకంప కేంద్రం(National Centre for Seismology) వెల్లడించింది. సమాచారం ప్రకారం.. సోమవారం ఉదయం ఐదు గంటలకు భూకంపం సంభవించింది. హింగోలిలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే.. ఆదివారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్(Andaman Nicobar) దీవుల్లోని అండమాన్ సముద్రంలో కూడా భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం రోజు రాత్రి 7.36 గంటలకు భూకంపం సంభ‌వించ‌గా.. భూకంప కేంద్రం 120 కి.మీ లోతులో కేంద్రీకృత‌మై ఉంది. జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లోని దోడాలో కూడా గురువారం 3.9 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Updated On 19 Nov 2023 10:53 PM GMT
Yagnik

Yagnik

Next Story