☰
✕
మహారాష్ట్రలోని హింగోలిలో ఉదయం 6.08 గంటల ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది.
x
మహారాష్ట్రలోని హింగోలిలో ఉదయం 6.08 గంటల ప్రాంతంలో బలమైన భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది. 6.19 గంటలకు మరోసారి భూ ప్రకంపనలు రావడం గమనార్హం. ఈసారి భూకంప తీవ్రత 3.6గా నమోదైంది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు గంటల్లోనే రెండుసార్లు భూకంపం సంభవించింది.
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం తెల్లవారుజామున రెండు భూకంపాలు సంభవించాయి. ఉదయం 01:49 గంటలకు 3.7 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం.. 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని ఎన్‌సీఏ అధికారులు తెలిపారు.
Yagnik
Next Story