మంగళవారం తెల్లవారుజామున లడఖ్‌లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5గా నమోదైంది.

Earthquake in Ladakh
మంగళవారం తెల్లవారుజామున లడఖ్(Ladakh)లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్(National Center for Seismology) ప్రకారం.. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలు(Richter Scale)పై 4.5గా నమోదైంది. ఉదయం 4:33 గంటలకు భూకంపం(Earthquake) సంభవించింది. భూకంప కేంద్రం ఉపరితలం నుండి 5 కిలోమీటర్ల దిగువన ఉంది. ఈరోజు అర్థరాత్రి జమ్మూ(Jammu)లో కూడా భూకంపం సంభవించడం గమనార్హం.
జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేల్‌పై 3.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. NCS ప్రకారం.. భూకంపం తెల్లవారుజామున 1.10 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో సంభవించింది.
