అస్సాంలోని మోరిగావ్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Earthquake hits Assam’s Morigaon
అస్సాం(Assam)లోని మోరిగావ్(Morigaon)లో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్(Richter Scale)పై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (National Centre for Seismology) తెలిపింది. శుక్రవారం రాత్రి 11.38 గంటలకు 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు ఎన్‌సీఎస్(NCS) వెల్లడించింది. భూకంపం దాటికి ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ధృవీకరించలేదు. పూర్తివివరాలు తెలియాల్సివుంది.
గత నెలలో కూడా అస్సాం(Assam)లో భూకంపం వచ్చింది. డిసెంబర్ 7న ఉదయం 5:42 గంటలకు అస్సాంలోని గౌహతి(Guvahathi)లో రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ధృవీకరించింది.
