బీజేపీ(BJP) కార్యకర్త దుర్గేశ్ పాండే(Durgesh Pandey) చేసిన పనిని అభిమానం అనాలో? లేక పిచ్చి అని అనాలో తెలియడం లేదు. మొన్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ఫలితాలు వచ్చాయి కదా! మొదట్లో ఇండి కూటమి కాసింత ముందంజలో ఉన్నట్టు అనిపించడంతో చత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బలరామ్‌పూర్(Balarampur) జిల్లాకు చెందిన దుర్గేశ్ పాండే కంగారు పడ్డాడు.
బీజేపీ(BJP) కార్యకర్త దుర్గేశ్ పాండే(Durgesh Pandey) చేసిన పనిని అభిమానం అనాలో? లేక పిచ్చి అని అనాలో తెలియడం లేదు. మొన్న లోక్‌సభ ఎన్నికల(Lok Sabha Elections) ఫలితాలు వచ్చాయి కదా! మొదట్లో ఇండి కూటమి కాసింత ముందంజలో ఉన్నట్టు అనిపించడంతో చత్తీస్‌గఢ్‌లోని(Chhattisgarh) బలరామ్‌పూర్(Balarampur) జిల్లాకు చెందిన దుర్గేశ్ పాండే కంగారు పడ్డాడు. ఆందోళన చెందాడు. స్థానిక కాళి మాతా గుడికి వెళ్లి బీజేపీకే విజయం దక్కాలని ప్రార్థించాడు. ఎండ్ ఆఫ్ ది డే ఎన్టీయే కూటమికే అత్యధిక సీట్లు వచ్చాయి. దాందో దుర్గేశ్ పాండే ఆనందపడ్డాడు. మళ్లీ కాళీ మాత ఆలయానికి వెళ్లాడు. ఎడమ చేతి వేలును(Fingure) నరుక్కున్నాడు. కాళికాదేవికి సమర్పించాడు. తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో చేతికి ఓ గుడ్డ కట్టుకున్నాడు. అయినా రక్తం కారుతూనే ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అంబికాపూర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సలో జాప్యం జరగడంతో దుర్గేశ్ నరుక్కున వేలును తిరిగి అతికించలేకపోయారు. ప్రస్తుతం దుర్గేశ్ పరిస్థితి నిలకడగానే ఉందని, ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు తెలిపారు.