మత సామరస్యానికి మనదేశం ప్రతీక! మనుషుల మధ్య మత చిచ్చు పెట్టాలని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని పనేనని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అస్సాంలోని(Assam) శివసాగర్ జిల్లా(Shiva Nagar District) ప్రజలు ఇదే చాటి చెబుతున్నారు. అక్కడ ఉన్న దేవి డౌల్ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం దుర్గాష్టమి(Durgashtami) రోజున అక్కడ ఓ ముస్లిం కుటుంబం అమ్మవారికి(Muslim Family) పూజలు చేస్తుంది. తర్వాత దుర్గామాత ప్రసాదాన్ని స్వీకరిస్తుంది.

Muslim Daulla family
మత సామరస్యానికి మనదేశం ప్రతీక! మనుషుల మధ్య మత చిచ్చు పెట్టాలని ఎందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది జరగని పనేనని కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అస్సాంలోని(Assam) శివసాగర్ జిల్లా(Shiva Nagar District) ప్రజలు ఇదే చాటి చెబుతున్నారు. అక్కడ ఉన్న దేవి డౌల్ ఆలయం మత సామరస్యానికి చిహ్నంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం దుర్గాష్టమి(Durgashtami) రోజున అక్కడ ఓ ముస్లిం కుటుంబం అమ్మవారికి(Muslim Family) పూజలు చేస్తుంది. తర్వాత దుర్గామాత ప్రసాదాన్ని స్వీకరిస్తుంది. దాదాపు 290 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ముస్లిం దౌల్లా కుటుంబం దుర్గామాతకు దుర్గాష్టమి పూజలను నిర్వహించింది. తర్వాత ఆలయ పూజారి దుర్గామాత ప్రసాదాన్ని సంప్రదాయబద్ధంగా ముస్లిందౌల్లా కుటుబానికి అందించారు. అహోం రాజుల పరిపాలన నుంచే దౌల్లా ముస్లిం కుటుంబానికి దుర్గా పూజా ప్రసాదం అందించడం అనేది అనవాయితీగా వస్తోందని చెబుతున్నారు. వందల ఏళ్ల కిందట స్వర్గదేవు శివ సింహ అనే రాజు కలంచుపారియా గ్రామంలో ప్రజల అవసరాల కోసం ఓ చెరువును తవ్వించాడు. అక్కడే ఓ దుర్గా మాత ఆలయాన్ని కూడా కట్టించారు. అప్పటి నుంచి దుర్గాదేవి గుడిలో పూజ జరిగే సమయంలో దౌల్లా కుటుంబికులు నగారా, ధాక్ మోగిస్తున్నారు. క్రమంగా వీరు నగారా, ధాక్ వాయించడం ఆపేసినప్పటికీ దుర్గా ప్రసాదం ఇచ్చే సంప్రదాయం మాత్రం అలాగే కొనసాగుతూ వస్తోంది.
