కోల్‌కతా(Kolkata) నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వీధివీధిన దుర్గామాత మండపాలు(Mandapam) వెలిశాయి. ఒక్కో మండపాన్ని ఒక్కో తీరుగా తీర్చిదిద్దారు. కళాకారుల సృజనాత్మకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కోల్‌కతా నగర దక్షిణ శివారు ప్రాంతం బెహలాలో(Behala) ఏర్పాటు చేసిన దుర్గా మండపం అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది.

కోల్‌కతా(Kolkata) నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వీధివీధిన దుర్గామాత మండపాలు(Mandapam) వెలిశాయి. ఒక్కో మండపాన్ని ఒక్కో తీరుగా తీర్చిదిద్దారు. కళాకారుల సృజనాత్మకత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇక కోల్‌కతా నగర దక్షిణ శివారు ప్రాంతం బెహలాలో(Behala) ఏర్పాటు చేసిన దుర్గా మండపం అందరినీ అమితంగా ఆకర్షిస్తోంది. ఈ అమ్మవారి మండపం అందంలో మాత్రమే కాకుండా రుచిలో కూడా బేషుగ్గా ఉంది. బెహలా నోటున్‌దాల్‌ క్లబ్‌(Notundal Club) ఏర్పాటు చేసిన ఈ మండపాన్ని పానీపూరీలతో(Panipuri) అలంకరించారు. నార్త్‌ ఇండియాలో గప్‌చుప్‌లను గోల్‌గప్ప(Golgappa) అని కూడా అంటారు. కోలకతా వాసులకు గప్‌చుప్‌లతో విడదీయరాని సంబంధం ఉంది. చాలా మందికి ఇష్టమైన ఈ స్ట్రీట్‌ ఫుడ్‌తో దుర్గాదేవి మండపాన్ని అలంకరించడం చాలా మందికి నచ్చింది.

Updated On 18 Oct 2023 4:32 AM GMT
Ehatv

Ehatv

Next Story