ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) దుబౌలియాలో(Duboulia) పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మూడు రోజుల కిందట దుబౌలియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోకుల్‌పూర్‌ రోడ్డు పక్కన పోలీసులకు ఓ అనాథ మృతదేహం(Deadbody) లభ్యమయ్యింది. అప్పటికే ఆ శవం పూర్తిగా కుళ్లిపోయిన(Decompose) స్థితిలో ఉంది. దీంతో తీవ్రమైన దుర్గంధం వస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని(UttarPradesh) దుబౌలియాలో(Duboulia) పోలీసులు మరోసారి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మూడు రోజుల కిందట దుబౌలియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గోకుల్‌పూర్‌ రోడ్డు పక్కన పోలీసులకు ఓ అనాథ మృతదేహం(Deadbody) లభ్యమయ్యింది. అప్పటికే ఆ శవం పూర్తిగా కుళ్లిపోయిన(Decompose) స్థితిలో ఉంది. దీంతో తీవ్రమైన దుర్గంధం వస్తోంది. గోనెసంచీలో కట్టివేసి ఉన్న ఆ శవానికి పొడవైన జట్టు ఉంది. దాంతో పోలీసులు అది మహిళ మృతదేహమని నిర్ధారిస్తూ, మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించారు. అయితే డాక్టర్లు ఆ శవాన్ని పరిశీలించి అది పురుషుడిదని గుర్తించారు. పోలీసులు చేసిన తప్పిదాన్ని నిరసిస్తూ పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు. మరోసారి పంచనామా చేసిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహిస్తామని తేల్చిచెప్పారు డాక్టర్లు. కాగా ఇప్పటి వరకు అది ఎవరి మృతదేహమన్నది తెలియరాలేదు.

Updated On 7 Sep 2023 3:15 AM GMT
Ehatv

Ehatv

Next Story