నిప్పుతో చెలగాటమాడకూడదంటారు పెద్దలు. మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇలాంటి హితోక్తులు చెవికెక్కవు. అందుకే ఆ వ్యక్తి కాలుతున్న బాణాసంచా(Fire work) పెట్టెను నెత్తిన పెట్టుకుని డ్యాన్స్‌(Dance) చేశాడు. ఆ మంటలు కాస్తా దుస్తులకు అంటుకోవడంతో ఆ పెట్టును కిందపడేశాడు.

నిప్పుతో చెలగాటమాడకూడదంటారు పెద్దలు. మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇలాంటి హితోక్తులు చెవికెక్కవు. అందుకే ఆ వ్యక్తి కాలుతున్న బాణాసంచా(Fire work) పెట్టెను నెత్తిన పెట్టుకుని డ్యాన్స్‌(Dance) చేశాడు. ఆ మంటలు కాస్తా దుస్తులకు అంటుకోవడంతో ఆ పెట్టును కిందపడేశాడు. దాంతో అక్కడున్న వారంతా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పీకలదాకా తాగిన(drunk) ఓ వ్యక్తి పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నాడు. కాలుతున్న క్రాకర్స్‌ పెట్టెను తలపై పెట్టుకుని చిందులేశాడు. పక్కనే ఉన్న కొందరు యువకులు కూడా డ్యాన్సులు చేస్తూ అతగాడని ప్రోత్సహించారు. దాంతో మరికాసింత రెచ్చిపోయాడు. బాణాసంచా నుంచి వచ్చిన మంటలు ఆ వ్యక్తి దుస్తులకు అంటుకోవడంతో కంగారుపడ్డాడు. ఆ కంగారులో అదుపు తప్పాడు. నెత్తి మీద ఉన్న బాణాసంచా పెట్టెను కింద పడేశాడు. కాలుతున్న బాణాసంచా అన్ని వైపులకు దూసుకెళ్లాయి. పెళ్లి ఊరేగింపులో పాల్గొన్నవారు భయంతో వణికిపోయారు. అక్కడ్నుంచి పరుగులు పెట్టారు. ఆ వ్యక్తి చేసిన పనిని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.

Updated On 17 April 2024 12:56 AM GMT
Ehatv

Ehatv

Next Story