ఓరల్‌ సెక్స్‌(Fillatio) గొంతు క్యాన్సర్‌(Throat Cancer) ప్రమాదాన్ని పెంచుతుందా అంటే అవుననే చెప్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ (HPV) ఇందుకు కారణమవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే నోటి సెక్స్‌ వల్ల గొంతు క్యాన్సర్‌కు దారి తీస్తాయని పలు గ్లోబల్ నివేదికలు వెల్లడించాయి. ప్రధానంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ కారణంగా ఇది వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఓరల్‌ సెక్స్‌ చేసేవారు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌లు, పరీక్షలు చేయించుకోవాలని ముంబైకి చెందిన మదర్‌ హుడ్‌ హాస్పిటల్‌కు(Motherhood Hospitals) చెందిన ప్రముఖ డాక్టర్‌ ప్రతిమా థామ్కే(Pratima Thamke) వివరించారు. సురక్షితమైన లైంగిక పద్ధతులు(Safety Measures) పాటిస్తే గొంతు క్యాన్సర్‌ ప్రమాదానికి అరికట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

కొందరు రకరకాల శృంగార(Romantic) అనుభూతులు పొందుతుంటారు. అలాగే కొందరికి ఓరల్‌ సెక్స్‌ అంటే ఇష్టం. ముఖ్యంగా మన దేశంలో ఈ ఓరల్‌ సెక్స్‌ పట్ల ఆడవారి కంటే మగవారికే ఎక్కువ మక్కువ ఉంటుందని తేలింది. అయితే తాజాగా మనవాళ్లు కూడా పాశ్చత్య పోకడలకు వెళ్తూ విచ్చలవిడి శృంగారాన్ని అనుభవిస్తున్నారు. ఇందులో భాగమే ఓరల్‌ సెక్స్‌. అయితే ఈ ఓరల్‌ సెక్స్‌ వల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తప్పవంటున్నారు వైద్య నిపుణులు.

ఓరల్‌ సెక్స్‌(Fillatio) గొంతు క్యాన్సర్‌(Throat Cancer) ప్రమాదాన్ని పెంచుతుందా అంటే అవుననే చెప్తున్నారు ప్రముఖ వైద్య నిపుణులు. హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్ (HPV) ఇందుకు కారణమవుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇప్పటికే నోటి సెక్స్‌ వల్ల గొంతు క్యాన్సర్‌కు దారి తీస్తాయని పలు గ్లోబల్ నివేదికలు వెల్లడించాయి. ప్రధానంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ కారణంగా ఇది వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఓరల్‌ సెక్స్‌ చేసేవారు ఎప్పటికప్పుడు స్క్రీనింగ్‌లు, పరీక్షలు చేయించుకోవాలని ముంబైకి చెందిన మదర్‌ హుడ్‌ హాస్పిటల్‌కు(Motherhood Hospitals) చెందిన ప్రముఖ డాక్టర్‌ ప్రతిమా థామ్కే(Pratima Thamke) వివరించారు. సురక్షితమైన లైంగిక పద్ధతులు(Safety Measures) పాటిస్తే గొంతు క్యాన్సర్‌ ప్రమాదానికి అరికట్టవచ్చంటున్నారు వైద్య నిపుణులు.

కొందరు తమ, తమ శృంగార జీవితం గురించి చెప్పుకోడానికి సిగ్గుపడతారని.. అయితే రోగులు వారి మానసిక ఆందోళనలు, తమ సెక్స్‌లైఫ్(Physical Life) గురించి మొహమాటం లేకుండా చెప్పుకునే పరిస్థితులను కల్పించాలని సూచించారు. గొంతు క్యాన్సర్‌ బారిన పడకుండా పేషెంట్స్‌కు అవగాహన కల్పించాలని చెప్తున్నారు. రెగ్యులర్‌ స్క్రీనింగ్‌లు(Screening Test), టీకాలు(Vaccine) వేయడం, సురక్షితమైన లైంగక చర్యలను ప్రోత్సహించాలని చెప్తున్నారు. HPV-16, HPV-18 అనే వైరస్‌లు గర్భాశయ క్యాన్సర్‌కు దారి తీస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి. HPV-6, HPV-11 అనే వైరస్‌లు కూడా కొన్ని సందర్భాల్లో క్యాన్సర్‌కు దారితీసే అవకాశముంది.

ఓరల్‌ సెక్స్‌లో పాల్గొనేవారు రెగ్యులర్‌గా ఓరోఫారింజియల్‌ స్క్రీనింగ్‌లు(Oropharyngeal screenings) చేయించుకోవాలని.. అధిక ప్రమాదం ఉన్న వైరస్‌లతో జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. తమ శృంగార లైఫ్ గురించి డాక్టర్లతో క్షుణ్ణంగా చర్చించి.. గొంతు క్యాన్సర్‌ రాకుండా ముందే అరికట్టుకోవాలని సూచిస్తున్నారు. థ్రోట్‌ క్యాన్సర్‌ రిస్క్‌ ఉంటే గొంతు, మెడ భాగాలను రెగ్యులర్‌గా స్క్రీనింగ్‌ చేస్తామని వైద్యులు చెప్పుకొచ్చారు. క్యాన్సర్‌కు ముందుగా వచ్చే లక్షణాలు లేదా గాయాలను గుర్తించి అందుకు అవసరమైన శస్త్రచికిత్స అందిస్తామని తెలిపారు. అయితే సురక్షితమైన పద్ధతిలోనే శృంగారంలో పాల్గొంటే ఇలాంటి క్యాన్సర్లను నివారించే అవకాశముందని ముంబైలోని మదర్‌హుడ్ హాస్పిటల్ డాక్టర్ ప్రతిమా థమ్కే తెలిపారు. సో ఓరల్‌ సెక్స్‌లో పాల్గొంటున్నారా.. జాగ్రత్తలు పాటించాల్సిందే..!

Updated On 21 Nov 2023 12:50 AM GMT
Ehatv

Ehatv

Next Story