ఏ తండ్రికైనా తన పిల్లలు బాగా చదవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని, జీవితంలో ఎదగాలని ఉంటుంది. అందుకోసం తండ్రులు చాలా కష్టపడుతుంటారు. కొందరేమో నిరంతరం చదవు చదువు అని పిల్లలను వేపుకుతింటారు. మరి కొందరేమో పిల్లలపై సదా నిఘా పెడుతుంటారు. పిల్లలను చదవుల యంత్రంలా తయారు చేస్తుంటారు. కానీ తండ్రులందరూ అలా ఉండరు.

ఏ తండ్రికైనా తన పిల్లలు బాగా చదవాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని, జీవితంలో ఎదగాలని ఉంటుంది. అందుకోసం తండ్రులు చాలా కష్టపడుతుంటారు. కొందరేమో నిరంతరం చదవు చదువు అని పిల్లలను వేపుకుతింటారు. మరి కొందరేమో పిల్లలపై సదా నిఘా పెడుతుంటారు. పిల్లలను చదవుల యంత్రంలా తయారు చేస్తుంటారు. కానీ తండ్రులందరూ అలా ఉండరు. ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ ప్రయాగ్‌రాజ్‌కు(Prayagraj) చెందిన డాక్టర్‌ ప్రకాశ్‌ ఖైతాన్‌(Dr.Prakash Khaitan).. ఈయన ఏం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆయన కూతురుకు సవాల్‌ విసిరారు. 'నీతో పాటు నేనూ చదవి పరీక్ష రాస్తాను.

ఎవరికి మంచి ర్యాంక్‌ వస్తుందో చూద్దాం' అని బిడ్డతో ఛాలెంజ్‌ చేశారు. నీట్‌-2023 ర్యాంక్‌ కోసం తండ్రి చేసిన పని మంచి ఫలితాన్నే ఇచ్చింది. అసలేం జరిగిందో తెలుసుకునే ముందు 49 ఏళ్ల డాక్టర్‌ ప్రకాశ్‌ ఖైతాన్‌ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం! ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఈయన పెద్ద న్యూరో సర్జన్‌(Nuero Surgeon). 1992లో ఎంట్రన్స్‌ రాసి మెడిసిన్‌లో సీట్ సంపాదించారు. 1999లో పీజీ సీట్‌ కూడా సాధించారు. ఎంఎస్‌ చేశారు. 2003లో న్యూరో సర్జరీ కంప్లీట్‌ చేశారు. అంతేకాదు 2011లో ఎనిమిదేళ్ల పాట మెదడు నుంచి ఎనిమిది గంటల్లో 296 సిస్ట్‌లు తొలగించి గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించాడు. ఈయనకు తన కూతురు మిథాలీ(Mithali) నీట్‌ పరిక్షకు సరిగ్గా ప్రిపేర్‌ అవ్వడం లేదనే అనుమానం కలిగింది.

ప్రకాశ్‌ ఖైతాన్‌ ఏం చెప్పారంటే ' ఇంటర్మీడియట్‌ తర్వాత ఎంబీబీఎస్‌లో చేరాలంటే నీట్‌లో తప్పనిసరిగా ర్యాంక్‌ సాధించాలి. కోవిడ్‌ కాలంలో నా కూతురు ఇంటర్మీడియట్‌ గడిచింది. కోవిడ్‌ పూర్తిగా ముగిసినా నా కూతురు ఎందుకో పాఠాల మీద ధ్యాస పెట్టేది కాదు. ఆమెను రాజస్థాన్‌లోని కోటాలో కోచింగ్‌ కోసం చేర్పించాను. కానీ అక్కడ నచ్చక తిరిగి వచ్చేసింది. ఏం చేయాలో పాలుపోలేదు. బాగా ఆలోచించిన తర్వాత ఓ మార్గం తట్టింది. ఆమెతో పాటు కలిసి చదవడం మంచిదని అనుకున్నాను. నేను కూడా నీతో చదివి నీట్‌(NEET) రాస్తాను. ఇద్దరం చదువుదాం.

ఎవరికి మంచి ర్యాంక్‌ వస్తుందో చూద్దాం అని చెప్పాను' అని డాక్టర్‌ ప్రకాశ్‌ తెలిపారు. తండ్రి విసిరిన సవాల్‌ను కూతురు స్వీకరించింది. ఎప్పుడో 30 ఏళ్ల కిందట ఎంబీబీఎస్‌ ఎంట్రన్స్‌ రాసి సీట్‌ సంపాదించిన తండ్రి తన కోసం మరోసారి పరీక్ష రాస్తాననేసరికి మిథాలీకి సరికొత్త ఉత్సాహం వచ్చింది. వైద్య వృత్తిలో తీరిక లేకున్నా కూతురు కోసం సమయం వెచ్చించేవారు ప్రకాశ్‌. ఉదయం, సాయంత్రం బిడ్డతో కలిసి కూచుని చదివేవాడు. సిలబస్‌ డిస్కస్‌ చేసేవారు. ఏఏ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందో, వాటికి జవాబులు ఎలా రాయాలో ఇద్దరూ చర్చించుకునేవారు. అలా నెమ్మదిగా మిథాలీకి పుస్తకాల మీద ఇంట్రెస్ట్‌ పెరిగింది. మే 7వ తేదీన జరిగిన నీట్‌ ఎంట్రన్స్‌లో తండ్రీ కూతుళ్లకు చెరో చోట సెంటర్‌ పడింది.

ఇద్దరూ వెళ్లి చక్కగా పరీక్ష రాశారు. జూన్‌లో ఫలితాలు వచ్చాయి. మిథాలీకి 90 శాతం మార్కులు వస్తే ప్రకాశ్‌కు 89 శాతం మార్కులు వచ్చాయి. సెప్టెంబర్‌ చివరి వరకూ అడ్మిషన్స్‌ జరిగాయి. మిథాలీకి ప్రతిష్టాత్మకమైన మణిపాల్‌ కస్తూర్బా మెడికల్‌ కాలేజీలో సీట్‌ వచ్చింది. ఇప్పుడు డాక్టర్‌ ప్రకాశ్‌ ఖైతాన్‌ తండ్రులకు ఆదర్శంగా నిలిచారు. ఆ వయసులో తనే చదవగలిగినప్పుడు, ఈ వయసులో నువ్వు చదవడానికి ఏమి అనే సందేశం ఇచ్చి కూతురిని గెలిపించుకున్నారు. తను కూడా గెలిచారు.

Updated On 25 Oct 2023 2:23 AM GMT
Ehatv

Ehatv

Next Story