హిందువుల చిరకా స్వప్నం అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir) నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు(Massive funding) సమకూరుతున్నాయి. రామ మందిర నిర్మాణానికి తోచినంత విరాళాలు ఇచ్చి తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే విరాళాల రూపంలో ఇప్పటి దాకా..ఎంత మొత్తం వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఉంటుంది. అయితే ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది.

హిందువుల చిరకా స్వప్నం అయోధ్య రామ మందిరం(Ayodhya Ram Mandir) నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు(Massive funding) సమకూరుతున్నాయి. రామ మందిర నిర్మాణానికి తోచినంత విరాళాలు ఇచ్చి తమ భక్తిని చాటుకుంటున్నారు. అయితే విరాళాల రూపంలో ఇప్పటి దాకా..ఎంత మొత్తం వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ఉంటుంది. అయితే.. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్(Sri Ram Janmabhoomi Tirtha Kshetra Trust) మాత్రం అయోధ్య ఆలయ నిర్మాణానికి రూ.900 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలోని 11 కోట్ల మంది నుంచి ఈ మొత్తాన్ని విరాళాల రూపంలో సేకరించాలని నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్ అంతానికి ఐదువేల కోట్ల రూపాయలకుపైగా విరాళాల రూపంలో అందాయి. ఇప్పటివరకు 18 కోట్ల మంది రామభక్తులు నేషనల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలలో సుమారు 3,200 కోట్ల రూపాయలు జమ చేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. ఈ బ్యాంకు ఖాతాలలో విరాళంగా వచ్చిన మొత్తాన్ని ట్రస్ట్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసింది. దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనులు జగినట్టు వెల్లడించింది. మరోవైపు నూతన రామాలయ నిర్మాణానికి ఆధ్యాత్మిక గురువు(spiritual teacher), కథకులు మొరారీ బాపు(Morari Bapu)..అత్యధికంగా రూ. 11.3 కోట్లు విరాళంగా అందజేసినట్టు ఆలయ ట్రస్ట్ తెలిపింది. వివిధ దేశాలలో ఉన్న ఆయన అనుచరులు కూడా సమిష్టిగా, విడివిడిగా రూ. 8 కోట్లు అందజేసినట్టు వెల్లడించింది. అలాగే గుజరాత్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి గోవింద్‌భాయ్ ధోలాకియా(Merchant Govindbhai Dholakia) రూ.11 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇక..అమెరికాలో ఉన్న ఒక అజ్ఞాత భక్తుడు ఆలయ ట్రస్టుకు విరాళంగా రూ.11,000 పంపారు. అయోధ్య ఆలయ నిర్మాణానికి తొలి విదేశీ విరాళం కూడా ఇదే. 2021, జనవరి 14న అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే ప్రచారాన్నిఅప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్(RamNath Kovind) ప్రారంభించారు. దేశంలోనే.. అయోధ్య ఆలయ నిర్మాణానికి చెక్కు రూపంలో రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చిన తొలి వ్యక్తి కూడా రామ్‌నాథ్ కోవిందే.

Updated On 8 Jan 2024 5:10 AM GMT
Ehatv

Ehatv

Next Story