మూడేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోరా వైరస్‌(Corona virus) ఇంకా కనుమరుగు కాలేదా? సరికొత్త రూపాలతో మన మధ్యనే తిరుగాడుతోందా? అంటే అవుననే అనుకోవాలి. ఒమిక్రాన్‌(Omicron) వేరియంట్‌ ఉత్పరివర్తనమై బీఏ.2.86(BA.2.86) రూపంలో మనపై దాడికి సిద్ధమవుతోంది.

మూడేళ్ల పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోరా వైరస్‌(Corona virus) ఇంకా కనుమరుగు కాలేదా? సరికొత్త రూపాలతో మన మధ్యనే తిరుగాడుతోందా? అంటే అవుననే అనుకోవాలి. ఒమిక్రాన్‌(Omicron) వేరియంట్‌ ఉత్పరివర్తనమై బీఏ.2.86(BA.2.86) రూపంలో మనపై దాడికి సిద్ధమవుతోంది. ఇప్పటికే బ్రిటన్‌లో(Britain) వేగంగా వ్యాప్తి చెందుతోన్న ఈ వైరస్‌ ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు అంటున్నారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో ప్రాణాలకు ముప్పు వాటిల్లకపోవచ్చు కానీ వ్యాధి లక్షణాలతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. కోవిడ్‌ -19 ప్రధాన లక్షణం రుచి లేదా వాసన కోల్పోవడం. అప్పట్లో కరోనా సోకిన వారిలో ఈ లక్షణాలు కనిపించేవి. ఇప్పుడు బీఏ.2.86 లక్షణమేమిటంటే అతిసారం, అలసట(Tiredness), నొప్పి(Pain), అధిక జ్వరం(High Fever), ముక్కు కారటం, గొంతునొప్పి విపరీతంగా బాధిస్తాయి. బీఏ.2.86 అంటుకున్నప్పుడు మొదట ముఖంపై ప్రభావం చూపిస్తుంది. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు వస్తాయి. శ్వాసకోశ వ్యవస్థను కూడా ఈ వ్యాధి ప్రభావితం చేస్తుంది. బీఏ.2.86 కేసులు బ్రిటన్‌లో వేగంగా పెరుగుతున్నాయని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ అంటోంది. ఇదిలా ఉంటే ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు, ఇమ్యూనిటీ పెంచేందుకు టీకాల ప్రచారాన్ని యూకే హెల్త్‌ సెక్యూరిటీ ఏజెన్సీ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని ప్రజలకు సూచిస్తోంది. ఈ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే కొన్ని నిబంధనలు పాటించకతప్పదని తెలిపింది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉంటే బెటరని, ఇంట్లో ఉన్నా మాస్క్‌ పెట్టుకోవడం ఉత్తమమని వివరించింది.

Updated On 18 Nov 2023 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story