ఓ వ్యక్తికి ఊపరి తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో అతను వైద్యులను సంప్రదించగా ఊపిరితిత్తుల్లో(Lungs) బొద్దింక(cockroach) ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 8 గంటలపాటు శ్రమించి 4 సెం.మీ.పొడవు ఉన్న బొద్దింకను తొలగించడంతో ఇటు రోగి, అటు డాక్టర్లు ఊపిరి తీసుకున్నారు. కేరళలో(Kerala) ఈ వైద్యచికిత్స జరిగింది. అసలు ఊపరితిత్తుల్లోకి బొద్దింక వెళ్లడమేంటి.. వైద్యులు దానిని వెలికితీయడమేంటి.. అనుకుంటున్నారా.. అయితే లెట్స్‌ రీడ్‌ దిస్‌ స్టోరీ..!

కేరళ రాష్ట్రం కొచ్చిలో 55 ఏళ్ల వ్యక్తికి ఊపరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. గత కొంత కాలంగా శ్వాస తీసుకోకలేకపోవడంతో అతను కొచ్చిలోని అమృత ఆస్పత్రి వైద్యులను సంప్రదించాడు. రోగిని స్కాన్‌ చేయగా ఊపిరితిత్తుల్లో బొద్దింక కనిపించింది. బొద్దింక వల్లనే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయని వైద్యులు గుర్తించారు. ఫిబ్రవరి 22న డాక్టర్ టింకు జోసెఫ్ నేతృత్వంలోని ఇంటర్వెన్షనల్ పల్మోనాలజీ బృందం రోగికి చికిత్స చేశారు. రోగి ఊపిరితిత్తుల నుండి బొద్దింకను విజయవంతంగా తొలగించడానికి వైద్యుల బృందానికి ఎనిమిది గంటల సమయం పట్టింది. శ్వాసకోశ ఆరోగ్య సమస్య కారణంగా ఈ చికత్స కూడా చాల కష్టతరమైంది. ఎంతో ఓర్పుతో చికిత్స చేసి బొద్దింకను విజయవంతంగా బయటకు తీశారు. తర్వాత కొన్ని రోజులపాటు రోగికి విశ్రాంతినిచ్చారు. ఇప్పుడు అతను పూర్తిగా కోలుకున్నాడని, డిశ్చార్చ్‌ చేశామని డాక్టర్‌ జోసెఫ్‌ తెలిపారు.

అయితే బొద్దింక అతని ఊపరితిత్తుల్లోకి ఎలా వెళ్లిందని అందరూ ప్రశ్నించగా రోగికి గతంలోనూ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. గతంలో జరిగిన వైద్య చికిత్స కోసం మెడ నుంచి పంపించిన శ్వాసనాళం ద్వారా ఈ బొద్దింక ప్రవేశించిందని తెలిపారు.

Updated On 29 Feb 2024 2:33 AM GMT
Ehatv

Ehatv

Next Story