దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ మోసాలు(Online trading fraud) రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా వందల సంఖ్యలో ఈ తరహా స్కాంల బారినపడి కోట్లల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అయితే చదువుకున్నవారు, సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్నవారే ఈ స్కాంల బారిన పడడం గమనార్హం. ఇదే తరహాలో గురుగ్రాంకు(Gurugram) చెందిన ఓ ప్రముఖ డాక్టర్(Doctor) సైబర్ నేరగాళ్ల(Cyber crimina) చేతిలో మోసపోయాడు.

స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి(investment) పేరుతో సైబర్ నేరగాళ్లు విసిరిన వలకు డాక్టర్ పునీత్ సర్దానా(Puneet Sardana) చిక్కిపోయారు. ఏకంగా రూ.2.5 కోట్లు నష్టపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఏడాది జనవరి 4న ఆన్‌లైన్ వేదికగా స్టాక్ మార్కెటింగ్‌లో పెట్టుబడికి సంబంధించిన ప్రకటన ఒకటి డాక్టర్‌ను ఆకర్షించింది. ఆన్‌లైన్ స్టాక్, ఐపీవో ఇన్వెస్ట్‌మెంట్స్ ద్వారా లాభాలు గడించవచ్చని సైబర్ నేరగాళ్లు డాక్టర్‌కు చెప్పి నమ్మబలికారు. ప్రకటనలో ఉన్న నెంబర్‌కు కాల్ చేసిన డాక్టర్ వాట్సాప్‌కు సైబర్ కంత్రీగాళ్లు లింక్ పంపారు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొవాలని కోరడంతో డాక్టర్ దానిని డౌన్‌లోడ్ చేసుకున్నాడు. యాప్ ద్వారా పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పిన నేరగాళ్లు నమ్మించారు. తొలుత రూ.50 వేల పెట్టుబడి పెట్టి షేర్ కొనుగోలు చేశాడు. కొన్ని రోజులపాటు మంచి లాభాలు రావడంతో ఆశకు మరింత పెట్టుబడి పెట్టారు. దీంతో యాప్‌లో తన షేర్ వ్యాల్యూ ఏకంగా రూ.3.19 కోట్లు చూపించింది. లాభాన్ని విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అందుకు అనుమతిలేదు. దీంతో డాక్టర్ స్కామర్స్‌ను సంప్రదించగా విత్ డ్రాయల్ చేసుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. వారి మాటలు నమ్మిన డాక్టర్ పలు సార్లు 1.5 కోట్ల వరకు ట్రాన్స్‌ఫర్ చేశాడు. మొత్తంగా 2.5 కోట్ల వరకు యాప్‌లో పెట్టుబడి పెట్టిన డాక్టర్.. విత్ డ్రా చేసుకునేందుకు యాక్సెస్ రాకపోవడంతో మోసపోయానని గ్రహించాడు. సైబర్ నేరగాళ్లపై పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.