మహారాష్ట్రలోని(Maharashtra) ఔరంగాబాద్ మరో మహిళా డాక్టర్ ఆత్మహత్య(Suicide) చేసుకుంది.
మహారాష్ట్రలోని(Maharashtra) ఔరంగాబాద్ మరో మహిళా డాక్టర్ ఆత్మహత్య(Suicide) చేసుకుంది. ఎంతగానో కష్టపడి వైద్య వృత్తిని అభ్యసించి డాక్టరయిన మహిళ భర్త(Husband) పెట్టే వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం చోటుచేసుకుంది. వైవాహిక జీవితంపై ఎన్నో ఆశలతో ఈఏడాది మార్చి డా.ప్రీతంను పెళ్లి చేసుకుంది. పెళ్లయిన కొత్తలో బాగున్నా కానీ రానురాను ప్రీతం(Preetham) తన నిజస్వరూపాన్ని బయటపెట్టసాగాడు. డా.ప్రతీక్ష(Prathiksha) క్యారెక్టర్‌ను అనుమానించేవాడు, అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో విసిగివేసారిపోయిన డా.ప్రతీక్ష ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్(Suicide note) రాసి ఆత్మహత్యకు గల కారణాలను రాసుకొచ్చింది. దీంతో భయపడిపోయిన డా.ప్రీతం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ప్రీతంను అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
డా.ప్రీతంకు ఈ ఏడాది మార్చి 27న ప్రతీక్షతో పెళ్లి జరిగింది. భార్య కూడా డాక్టర్ కావడం, పైగా అందంగా ఉండడంతో ఇరువురు నచ్చి పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. కొత్తలో కొంత కాలం బాగున్నా తన భార్య అందంగా ఉంటుందని ఎవరితోనో ఎఫైర్ ఉందని అనుమానించేవాడు. రష్యాలో(Russia) డాక్టర్ వృత్తి చదవి ఔరంగాబాద్ వచ్చిన ప్రీతంకు ఇక్కడే సొంత ఆస్పత్రి పెట్టాలని ఉండేది. డబ్బు సమకూరకపోవడంతో డా.ప్రతీక్షను అదనపు కట్నం తేవాలని వేధించేవాడు. ప్రీతం క్యారెక్టర్‌ను అనుమానిస్తూ నిత్యం ఫోన్ చెక్ చేసేవాడు. తన సోషల్ మీడియా ఫాలోవర్స్, మెసెజెస్ అన్నీ చెక్ చేసేవాడు. భార్య మొబైల్ స్క్రీన్ లాక్‌ను కూడా తన వేలి ముద్రలతో సెట్ చేశాడు. పైగా అదనపు కట్నం కోసం వేధించేవాడు.
ఈ క్రమంలోనే ఓ రోజు ప్రతీక్షకు ఫోన్ చేశాడు. ప్రతీక్ష ఆపరేషన్ థియేటర్‌లో ఉండగా ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో పదేపదే కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కాసేపటి తర్వాత ప్రతీక్ష తిరిగి ఫోన్ చేయగా ఒక్క సారిగా రెచ్చిపోయాడు. ఆమెను దుర్భాషలాడాడు. భర్త వేధింపులతో మానసికంగా కుంగిపోయిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ప్రతీక్షను స్వయంగా ఆస్పత్రికి తరలించాడు ప్రీతం. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు చెప్పడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రతీక్ష అంత్యక్రియలకు కూడా హాజరుకాకుండా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. ప్రీతంపై ప్రతీక్ష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా అతనిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ప్రీతంకు మరో మహిళతో ఎఫైర్(Affair) ఉందని తేలింది. అంతేకాకుండా ప్రీతం వేధింపులు తాళలేకే ప్రతీక్ష ఆత్మహత్య చేసుకుందని పోలీసుల విచారణలో తేలడంతో నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు.