ఓ డాక్టరమ్మకు తన బాయ్‌ఫ్రెండ్(Boyfriend) మీద పిచ్చ కోపం వచ్చేసింది. ఆ కోపంతో అతగాడి పురుషాంగాన్ని(Penis) కట్ చేసింది.
ఓ డాక్టరమ్మకు తన బాయ్‌ఫ్రెండ్(Boyfriend) మీద పిచ్చ కోపం వచ్చేసింది. ఆ కోపంతో అతగాడి పురుషాంగాన్ని(Penis) కట్ చేసింది. బీహార్‌లోని(Bihar) సరన్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పురుషాంగాన్ని కోల్పోయిన ఆ వ్యక్తి మధురా బ్లాక్‌లోని వార్డ్ నంబర్ 12 కౌన్సిలరట! ప్రస్తుతం అతడు పాట్నా మెడికల్ కాలేజీలో చికిత్స తీసుకుంటున్నాడు. గత అయిదేళ్ల నుంచి కౌన్సిలర్‌తో ఆ లేడి డాక్టర్ రిలేషన్‌లో ఉంది. పెళ్లి చేసుకుందామని చెప్పిన ప్రతీసారి ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తున్నాడు. పోనీ రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుందామని అడిగింది. పెళ్లి కోసం ఆమె కోర్టుకు కూడా వెళ్లింది. అతడు అక్కడికి కూడా రాకుండా హ్యాండిచ్చాడు. బాయ్‌ఫ్రెండ్ చేష్టలను సహించలేకపోయిన ఆ డాక్టరమ్మ అతడిని ఇంటికి పిలిచింది. ఇంటికి వచ్చిన ఆ కౌన్సిలర్ పురుషాంగాన్ని కట్ చేసి అతగాడిని పెళ్లికి పనికిరాకుండా చేసేసింది. అతడు లబోదిబోమని కేకలు పెడబొబ్బలు పెడుతుంటే చుట్టుపక్కల వారు వచ్చి చూశారు. విషయం తెలుసుకుని వెంటనే పోలీసులకు కబురుపెట్టారు. బెడ్‌పై రక్తపు మడుగులో ఉన్న అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. పాతికేళ్ల డాక్టరమ్మది హాజిపూర్. మధౌరాలో ప్రాక్టీస్ చేస్తోంది. ఆమెకు ఇంకా పెళ్లి కాలేదు. కౌన్సిలర్‌కు కూడా కాలేదని పోలీసులు చెప్పారు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.