ఓ ప్రభుత్వ డాక్టర్‌కు(Doctor) రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో(Rajasthan Elections) పోటీ చేయాలనిపించింది. ఒకవేళ ఓడిపోతే చక్కటి ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సిందేమోనని సంశయించారు. ఈ విషయంలో తనకు వెసులుబాటు కల్పించాలంటూ హైకోర్టును(High court) వేడుకున్నారు.

Dr.Deepak Ghogra Writ Petition
ఓ ప్రభుత్వ డాక్టర్‌కు(Doctor) రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో(Rajasthan Elections) పోటీ చేయాలనిపించింది. ఒకవేళ ఓడిపోతే చక్కటి ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సిందేమోనని సంశయించారు. ఈ విషయంలో తనకు వెసులుబాటు కల్పించాలంటూ హైకోర్టును(High court) వేడుకున్నారు. హైకోర్టు ఆ ప్రభుత్వ డాక్టర్ దీపక్ ఘోగ్రాకు(Deepak Ghogra) ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇచ్చింది.ఒకవేళ ఓడిపోతే ఆయన మళ్లీ ఉద్యోగంలో చేరడానికి కోర్టు అంగీకరించింది. భారతీయ ట్రైబల్ పార్టీ(Indian Tribal Party) టికెట్‌పై దుంగార్పూర్ స్థానం నుంచి దీపక్ ఘోగ్రా పోటీ చేస్తున్నారు. 43 ఏళ్ల దీపక్ దుంగార్పూర్ జిల్లా ఆసుపత్రిలో వైద్యుడిగా పని చేస్తున్నారు. పదేళ్లుగా జిల్లా ప్రజలకు వైద్య సేవలను అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. భారతీయ గిరిజన పార్టీ (బీటీపీ) రాష్ట్ర అధ్యక్షుడు వేలారామ్ ఘోగ్రా కుమారుడే దీపక్! తండ్రి ప్రోత్సాహంతోనే ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం హైకోర్టు అనుమతి ఇవ్వడంతోపాటు ఓడిపోతే ఉద్యోగానికి భరోసా ఇవ్వడంపై దీపక్ ఘోగ్రా సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీటీబీ 17 స్థానాల్లో అభ్యర్థులను పోటీకి నిలబెట్టింది. దీపక్ ఘోగ్రాతోపాటు మరో డాక్టర్ కూడా ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు.
