విశ్వాసానికి ప్రతీక కుక్క. దాన్ని పెంచుకునేవారు కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తారు. కుక్కలకు పెళ్లిళ్లు, బారసాలలు చేసేవారు కూడా ఉన్నారు. చనిపోతే కన్నీరు పెట్టుకునేవారిని కూడా చూశాం. మనం కుక్కను భైరవుడిగా భావిస్తాం. పూజలు చేస్తాం. కాశీకి వెళ్లివచ్చాక శునకానికి పూజలు చేసి వడమాలలు వేసే సంప్రదాయం కూడా ఉంది.

విశ్వాసానికి ప్రతీక కుక్క. దాన్ని పెంచుకునేవారు కుటుంబంలో ఓ సభ్యుడిగానే భావిస్తారు. కుక్కలకు పెళ్లిళ్లు, బారసాలలు చేసేవారు కూడా ఉన్నారు. చనిపోతే కన్నీరు పెట్టుకునేవారిని కూడా చూశాం. మనం కుక్కను భైరవుడిగా భావిస్తాం. పూజలు చేస్తాం. కాశీకి వెళ్లివచ్చాక శునకానికి పూజలు చేసి వడమాలలు వేసే సంప్రదాయం కూడా ఉంది. ఉత్తరప్రదేశ్‌(uttar pradesh)లో ఓ భైరవుని ఆలయంలో కూడా వందేళ్ల నుంచి కుక్కను పూజిస్తూ వస్తున్నారు. ఈ గుడిలో ఉన్న శునకం విగ్రహాన్ని పూజించడానికి భక్తులు పెద్దపెట్టున వస్తుంటారు. ఆ శునక విగ్రహం పాదాలకు నల్లదారం కట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక జరుగుతుందన్నది స్థానికుల గట్టి నమ్మకం. సుమారు వందేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌ బులంద్‌ షెహర్‌లోని సికింద్రాబాద్‌లో బాబా లటూరియా అనే ఓ గురువు ఉండేవారు. తమ సమస్యలను చెప్పుకోవడానికి చాలా మంది ఈయన దగ్గరకు వస్తుండేవారు. ఈ క్రమంలోనే ఆయన అక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఆ గుడిలోనే ఉంటూ ఓ కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్కను ఆయన భైరవ్ బాబాగా పిల్చుకునేవారు. స్థానికులు కూడా ఆ కుక్కను అదే పేరుతో పిలవసాగారు. ఇదిలా ఉంటే, తన చివరి రోజుల్లో బాబా లటూరియా సజీవ సమాధి అయ్యారు. తాను నిర్మించుకున్న గుడిలోనే తుది శ్వాస విడవడానికి సిద్ధమయ్యారు.. బాబా సమాధిలోకి వెళ్లిన తర్వాత ఆయన భక్తులు దాన్ని మూసివేస్తుండగా బైరవ్‌ అందులోకి దూకింది. స్థానికులు వెంటనే దాన్ని బయటకు తీసి సమాధిని మూసేశారు. కానీ తర్వాత కాసేపటికే భైరవ్‌బాబా చనిపోయింది. భైరవ్‌కు గుర్తుగా ఆ ఆలయంలోనే ఓ విగ్రహాన్ని నిర్మించారు. దానికి పూజలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం హోలీ, దీపావళి పండుగలప్పుడు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. మంగళ, శనివారాలలో భైరవ్‌ దర్శనానికి జనం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

Updated On 6 Dec 2023 6:47 AM GMT
Ehatv

Ehatv

Next Story