అయోధ్య(Ayodhya)లో బాబ్రీ మసీదు(Babri Masjid)ను కూల్చేశారు. కూల్చివేత తర్వాత భారత్‌(India)లో చాలా సంఘటనలు జరిగాయి. చివరికి 2019లో ఈ వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు(Supreme Court) ఓ తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అయిదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం ఆ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

అయోధ్య(Ayodhya)లో బాబ్రీ మసీదు(Babri Masjid)ను కూల్చేశారు. కూల్చివేత తర్వాత భారత్‌(India)లో చాలా సంఘటనలు జరిగాయి. చివరికి 2019లో ఈ వివాదాస్పద భూమిపై సుప్రీంకోర్టు(Supreme Court) ఓ తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అయిదు ఎకరాల స్థలంలో మసీదు నిర్మించుకోవచ్చు. ప్రస్తుతం ఆ నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాబ్రీ మసీదు స్థానంలో మహ్మద్‌ బిన్‌ అబ్దుల్లా మసీదు(Mohammed Bin Abdullah Masjid)ను నిర్మిస్తున్నారు. ఖురాన్‌లోని వాక్యాలను లిఖించిన ఇటుకలను మసీదు నిర్మాణం కోసం వినియోగించనున్నారు. అయోధ్యకు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న ధన్నీపూర్ గ్రామంలో ఈ మసీదును నిర్మిస్తున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు(Sunni Central Waqf Board)కు అనుసంధానంగా ఉన్న ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్(Indo-Islamic Cultural Foundation) నిర్మాణ బాధ్యతను చేపట్టింది. మే నెలలో నిర్మాణ పనులు మొదలు కానున్నాయి. 2028 నాటికి నిర్మాణం పూర్తి కావొచ్చు. ఈ మసీదులో అయిదు మినార్లు ఉంటాయి. అతి పెద్ద ఖురాన్‌(Quran)ను కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మసీదు కాంప్లెక్స్‌లో ఆసుపత్రి, మ్యూజియం, లైబ్రరీ, కమ్యూనిటీ కిచెన్, ఇండో-ఇస్లామిక్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

Updated On 15 April 2024 3:45 AM GMT
Ehatv

Ehatv

Next Story