నేపాల్‌లో(Nepal) స్వన్యపున్హిగా, సింగపూర్‌లో వెసాక్‌గా, ఇండోనేషియాలో హరివైసాక్‌గా, థాయ్‌లాండ్‌లో విశాక్‌బుచ్చగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఇక్కడే కాదు బౌద్ధులు ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో వైశాఖ పూర్ణిమను ఘనంగా జరుపుకుంటారు. శ్రీలంక, వియత్నాం, టిబెట్‌, మయన్మార్‌, భూటాన్‌, కొరియా, చైనా, కంబోడియా, జపాన్‌ దేశాల్లోనూ బుద్ధ పూర్ణిమ(Budha Purnima) వేడుకలు జరుగుతాయి.

నేపాల్‌లో(Nepal) స్వన్యపున్హిగా, సింగపూర్‌లో వెసాక్‌గా, ఇండోనేషియాలో హరివైసాక్‌గా, థాయ్‌లాండ్‌లో విశాక్‌బుచ్చగా బుద్ధ పూర్ణిమను జరుపుకుంటారు. ఇక్కడే కాదు బౌద్ధులు ఉన్న ఆగ్నేయాసియా దేశాల్లో వైశాఖ పూర్ణిమను ఘనంగా జరుపుకుంటారు. శ్రీలంక, వియత్నాం, టిబెట్‌, మయన్మార్‌, భూటాన్‌, కొరియా, చైనా, కంబోడియా, జపాన్‌ దేశాల్లోనూ బుద్ధ పూర్ణిమ(Budha Purnima) వేడుకలు జరుగుతాయి. బుద్ధ పూర్ణిమ రోజున ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం బుద్ధ గయ భక్తులతో కిక్కిరిసిపోతుంది. మహాబోధి వృక్షాన్ని(Mahabodhi tree) సందర్శించడానికి పెద్ద పెట్టున వస్తారు. బుద్ధ గయలోనే 80 అడుగుల ఎత్తయిన బుద్ధుడి విగ్రహం ఉంది. ఆ విగ్రహం దగ్గర నుంచి పెద్ద ఊరేగింపు మొదలువుతుంది.. రంగురంగుల పతకాలతో మహాబోధి ప్రాంగణం కళకళలాడుతుంటుంది. వారణాసి(varanasi)దగ్గర ఉన్న సార్‌నాథ్‌ కూ ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రమే! ఇక్కడే బుద్ధుడు తన మొదటి బోధను వినిపించాడు. థాయ్‌లాండ్‌, టిబెట్‌, భూటాన్‌ల నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షవులు ఇక్కడికి వస్తారు. బుద్ధుడి ఆశీస్సులను తీసుకుంటారు. ఒడిషాలోని(Odisha) ధవళగిరిలో కూడా బౌద్ధ పౌర్ణిమ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. బుద్ధ పూర్ణిమ రోజున బౌద్ధులు నియమనిష్టలతో ఉంటారు. పూర్తిగా శాకాహారమే తీసుకుంటారు. పాలు, పంచదార, బియ్యంతో చేసిన పరమాన్నం వండి బుద్ధుడికి నైవేద్యంగా సమర్పించుకుంటారు. వీలైనంత వరకు తెల్లటి దుస్తులను ధరిస్తారు.. రెండు రోజుల ముందే ఇంటిని శుభ్రం చేస్తారు. విద్యుద్దీపాలతో ఇంటిని అలంకరిస్తారు. భారత-నేపాల్‌ సరిహద్దు ప్రాంతంలో లుంబిని క్షేత్రం ఉంది. అచ్చంగా చెప్పాలంటే నేపాల్‌లోని రూపాందేహి జిల్లాలో ఉంది. ఇక్కడే మాయాదేవి గర్భాన గౌతమ బుద్ధుడు జన్మించాడు. హిమాలయ పర్వతపాద ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రం బుద్ధుడు విద్యాబుద్ధులు నేర్చుకున్న కపిలవస్తుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. లుంబిని ఇప్పుడో స్మాకరక కేంద్రం. బౌద్ధులకు పుణ్యస్థలి. లుంబినిలో ఓ పెద్ద వనం, ఓ పుష్కరిణి, తల్లి మాయాదేవి పేరున ఉన్న పెద్ద దేవాలయం ఉన్నాయి. 1896లో ఆర్కియాలజీ అధికారులు లుంబిని ప్రాంతాన్ని గుర్తించారు. మౌర్య చక్రవర్తి అశోకుడు లుంబినిని సందర్శించాడనడానికి ఆధారాలు కనుగొన్నారు. 1997లో లుంబిని క్షేత్రాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. బౌద్ధమత విభాగాలైన మహాయాన, వజ్రయాన ఆశ్రమాలు ఇక్కడ ఉన్నాయి.

Updated On 23 May 2024 4:03 AM GMT
Ehatv

Ehatv

Next Story