పండుగ అంటే ఒక సంబరం. ఒక ఉత్సాహం. యాంత్రికంగా సాగిపోయే జీవితాలలో ఒక ఆటవిడుపు పండుగ. అన్ని పండుగల్లో హోలీ(Holi)కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ పండుగ మన జీవితాలను వర్ణమయం చేస్తుంది. అందుకే హోలీ అంటే అందరికీ అంత ఇష్టం. ఇది వసంతాగమనానికి పీఠిక. ఓ ఆనంద వీచిక. కలకలం గుర్తుంచుకునే ఓ వేడుక. ప్రకృతి సరికొత్త అందాలను నింపుకుందనడానికి ఇదో సూచిక. ఆమని వచ్చే వేళ అవని కూడా రంగురంగులతో ముస్తాబవుతుంది.
పండుగ అంటే ఒక సంబరం. ఒక ఉత్సాహం. యాంత్రికంగా సాగిపోయే జీవితాలలో ఒక ఆటవిడుపు పండుగ. అన్ని పండుగల్లో హోలీ(Holi)కి ఓ ప్రత్యేకత ఉంది. ఆ పండుగ మన జీవితాలను వర్ణమయం చేస్తుంది. అందుకే హోలీ అంటే అందరికీ అంత ఇష్టం. ఇది వసంతాగమనానికి పీఠిక. ఓ ఆనంద వీచిక. కలకలం గుర్తుంచుకునే ఓ వేడుక. ప్రకృతి సరికొత్త అందాలను నింపుకుందనడానికి ఇదో సూచిక. ఆమని వచ్చే వేళ అవని కూడా రంగురంగులతో ముస్తాబవుతుంది. అవని ముస్తాబును చూసి మన మది కూడా మురిసిపోతుంది. ఆ మురిపెంలోనే రంగులు చల్లుకోవాలనిపిస్తుంది. ప్రకృతిలాగే జీవితమం కూడా వర్ణాలతో విరబూయాలని కోరుకుంటుంది. అదే వసంతోత్సవం అయ్యింది. కాలక్రమంలో హోలీ అయ్యింది. మన సంస్కృతిలో ఓ భాగమయ్యింది. చమ్మకేళీల సరాగమయ్యింది. హోలీ అంటే ఏడు రంగుల మేలకర్త రాగం. మన ఇంటి సంబరం. మన వాడ సంతోషం. మన దేశ సంప్రదాయం. పార్వతీ దేవి వద్దు వద్దంటున్నా మన్మథుడు పూలబాణంతో శివుడి తపమును భగ్నం చేస్తాడు. ముక్కంటికి కోపం వస్తుంది. మూడో కన్ను తెరుస్తాడు. మన్మథుడు భస్మమవుతాడు. ఫాల్గుణ పౌర్ణమినాడే ఇది జరిగింది. కుమారసంభవానికి, తారకాసుర సంహారానికి ఇది ప్రాతిపదిక అయ్యింది. హోలిక అనే రాక్షసి అంతానికి సంకేతంగా హోలీ ఏర్పడిందని కొందరు అంటారు. అగ్ని కూడా దహించ లేని హోలిక, హిరణ్య కశిపుని సోదరి. హరి నామ స్మరణ వీడని తన పుత్రుడైన ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చో బెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని ఆమెను, హిరణ్య కశిపుడు ఆదేశిస్తాడు. శ్రీహరి భక్తుడి స్పర్శ వల్ల హోలిక శక్తి హీనురాలై, అగ్నికి ఆహుతి అవుతుంది. ప్రహ్లాదుడు క్షేమంగా అగ్ని నుంచి బయటకు వస్తాడు. ఫాల్గుణ పౌర్ణమి నాడే బృందావనంలో యమునా తీరాన సిరి వెన్నెల మిసిమిలో, గోపికలపై కృష్ణుడు నానా విధాల వర్ణాలతో కూడిన వసంతాన్ని విరజిమ్మాడని భాగవతంలో పోతనామాత్యుడు అభివర్ణిస్తాడు. ఉత్తర భారత దేశంలో ఈ వేడుకనే డోలా జాత్రాగా నిర్వహిస్తారు. సుందరేశ్వర స్వామిని మెప్పించి మధుర మీనాక్షీ దేవి, పాల్గుణ పౌర్ణమి నాడే వివాహ మాడిందనీ, అందుకే ఈ పున్నమిని కల్యాణ పౌర్ణమి అని పేర్కొంటారని తమిళ ప్రాచీన గ్రంథాలు వివరిస్తున్నాయి. రుతువుల్లో వసంతరుతువును నేను అని చెప్పుకున్నాడు గీతలో శ్రీకృష్ణపరమాత్ముడు. నిజంగానే ఆరు రుతువుల్లో వసంతానికి సాటి మరోటి లేదు. ఆమని వచ్చిన వేళ అవని ఎంతగానో మురిసిపోతుంది.. మైమర్చిపోతుంది. ఉత్సహపడుతుంది. ఉత్సవం చేసుకుంటుంది. ఆ ఉత్సవమే ఫాల్గుణోత్సవం. అదే వసంతోత్సవం. ఆ వసంతాగమనానికి ఒక్కో చోట ఒక్కోలా స్వాగతం పలుకుతూ సంబరపడిపోతుంది. కల్యాణ పూర్ణిమ అన్నా, డోలా పున్నమి అన్నా, హుతశనీ పూర్ణిమ అన్నా, కాముని పున్నమి అన్నా, అనంతపూర్ణిమ అన్నా అదే వేడుక. అదే రంగుల వెదజల్లిక.హోలీ అన్నది మాత్రం జగద్విఖ్యాతి గడిచింది. ఫాల్గుణ శుద్ధ అష్టమి నుంచి పౌర్ణమి వరకు ఉండే ఎనిమిది రోజుల్ని హోలాష్టకం అంటారు. ఈ తిథులలో రోజుకొక్క గ్రహ స్వరూపం చొప్పున, నవ గ్రహాల్ని ఆరాధించే సంప్రదాయం ఉంది. నవ గ్రహాల్ని, అష్ట దిక్పాలకుల్ని ఫాల్గుణ పౌర్ణమి నాడు నవ ధాన్యాలతో సమార్చన చేసి, ఆ విగ్రహా కృతులపై చందన జలాన్ని చిలకరించే ప్రక్రియ హోలీ వేడుకగా స్థిర పడిందంటారు. ప్రకృతి మనకు ప్రసాదించిన సహజమైన రంగులతోనే హోలీని జరుపుకోవాలని పర్వ చూడామణి చెబుతుంది. ఫల, పుష్ప రసాలు, పసుపు కలిపిన చందనజలం, మోదుగ పూల గుజ్జు, పసుపు, కుంకుమ, కాసింత సున్నం కలిపిన వసంత జలాన్ని హోలీ రంగులుగా ఉపయోగించాలి. EHA పాఠకులందరికీ హోలీ శుభాకాంక్షలు.