Santaclaus Grave : శాంతాక్లాజ్ ఊహాజనితమా? నిజంగానే ఉన్నారా?
క్రిస్మస్(Christmas) పర్వదినాన మనల్ని ఆనందపరిచే వ్యక్తి సెయింట్ నికోలస్(Saint Nicholas). శాంతాక్లాజ్‌గా(Santaclaus) పిల్లలు పిల్చుకునే ఆయన క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వచ్చి పిల్లలకు బహుమతులు(Gift) ఇచ్చి వెళతాడన్నది ఓ నమ్మకం, ఓ విశ్వాసం.
క్రిస్మస్(Christmas) పర్వదినాన మనల్ని ఆనందపరిచే వ్యక్తి సెయింట్ నికోలస్(Saint Nicholas). శాంతాక్లాజ్‌గా(Santaclaus) పిల్లలు పిల్చుకునే ఆయన క్రిస్మస్ పండుగ ముందు రోజు రాత్రి వచ్చి పిల్లలకు బహుమతులు(Gift) ఇచ్చి వెళతాడన్నది ఓ నమ్మకం, ఓ విశ్వాసం. అందుకే క్రిస్మస్ తాతంటే పిల్లలకు ఎంతో ప్రేమ! శాంతాక్లాజ్ ఓ ఊహాజనితమైన వ్యక్తి అని అనుకుంటారు కానీ ఆయన నిజంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడాయన భూమ్మీద లేరంతే! మొన్నామధ్య శాంతాక్లాజ్ సమాధిని(grave) టర్కీకి(Turkey) చెందిన పురావస్తుశాఖ(Department of Archaeology) వారు కనుగొన్నారు కూడా! దక్షిణ టర్కీ అంటాల్యా ప్రొవిన్స్‌లోని డేమేరే జిల్లాలో ఉన్న చర్చి కింద శాంతాక్లాజ్ సమాధి ఉందని ఆర్కియాలజీ డిపార్టెంట్ చెబుతోంది. శాంతాక్లాజ్ అక్కడే పుట్టారనడానికి చారిత్రక గ్రంథాలే సాక్షి! చర్చిలోపల ఉన్న ఖాళీ ప్రదేశాలను పరిశీలిస్తున్నప్పుడు ఈ సమాధి వెలుగులోకి వచ్చింది. ఇన్నేళ్లయినా ఈ సమాధి చెక్కు చెదరకపోవడం ఓ విశేషం. మైరా బిషప్‌గా ఉన్న నికోలస్ బతికినంత కాలం క్రిస్మస్‌కు ముందు రోజు పిల్లలకు కానుకలను ఇచ్చేవారట! తన ఆదాయాన్నంతా పేద పిల్లలకే ఖర్చు పెట్టేవాడు. అప్పట్లో శాంతాక్లాజ్ వేడుకలు డిసెంబర్ ఆరున జరిగేవట! తదనంతర కాలంలో డిసెంబర్ 24కు మారింది. ఆ రోజున శాంతాక్లాజ్ ఆకాశంలో పయనిస్తూ పిల్లలకు కానుకలు ఇస్తాడని నమ్మకం.. క్రీస్తుశకం 343లో శాంతాక్లాజ్ మరణించారు..