మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) దో ధాగే శ్రీరామ్‌కే లియే ఉద్యమం ఊపందుకుంది. మనం చంద్రుడికో నూలుపోగు అంటాం కదా! అలాగే ఇప్పుడు శ్రీరామచంద్రుడికి(Lord Sri Ram) రెండు నూలు పోగులు అని అంటున్నారు పూణెలోని చేనేత కార్మికులు(Handloom worker). అయోధ్యలోని(Ayodhya) రామమందిరంలో(Ram Mandhir) కొలువుతీరబోతున్న రాముడి కోసం వస్త్రాలను(cloths) నేసే పనిలో పడ్డారు. వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులు మొదలు పెట్టారు.
మహారాష్ట్రలోని(Maharashtra) పూణెలో(Pune) దో ధాగే శ్రీరామ్‌కే లియే(Do dhaage shri Ram Ke Liye) ఉద్యమం ఊపందుకుంది. మనం చంద్రుడికో నూలుపోగు అంటాం కదా! అలాగే ఇప్పుడు శ్రీరామచంద్రుడికి(Lord Sri Ram) రెండు నూలు పోగులు అని అంటున్నారు పూణెలోని చేనేత కార్మికులు(Handloom worker). అయోధ్యలోని(Ayodhya) రామమందిరంలో(Ram Mandhir) కొలువుతీరబోతున్న రాముడి కోసం వస్త్రాలను(cloths) నేసే పనిలో పడ్డారు. వేలాది మంది చేనేత కార్మికులు మగ్గాలపై నేత పనులు మొదలు పెట్టారు. 13 రోజుల పాటు సాగే ఈ ఉద్యమంలో పాలుపంచుకోవడానికి చేనేత కార్మికులు ఉత్సాహపడుతున్నారు. డిసెంబర్ 10వ తేదీన శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం, పూణేకు చెందిన హెరిటేజ్ హ్యాండ్‌వీవింగ్ రివైవల్ ఛారిటబుల్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ ప్రచారానికి ప్రజల నుంచి బ్రహ్మండమైన స్పందన వస్తున్నదని ప్రచార నిర్వాహకురాలు అనఘా ఘైసాస్ చెప్పారు. రాబోయే 13 రోజుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమారు 10 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారని ఆమె తెలిపారు. శ్రీరామునికి అందించబోయే దుస్తులు పట్టుతో తయారవుతున్నాయని, వెండి బ్రోకేడ్‌తో ఈ వస్త్రాలను అలంకరిస్తామని అనఘా ఘైసాస్ తెలిపారు.