ఢిల్లీ మెట్రోకు(Delhi metro) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో(Social) ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి. డాన్సులు, రోమాన్సులు, ఫైట్లు, అప్పుడప్పుడు ముద్దుముచ్చట్లు.. ఇలా అనేక వీడియోలు వైరల్(Viral videos) అయ్యాయి. వీటిలో కొన్ని అభ్యంతరకంగా, అశ్లీలంగా కూడా ఉంటున్నాయి. ఇవన్నీ గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) చీఫ్ వికాస్ కుమార్(Vikas Kumar) ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ మెట్రోకు(Delhi metro) సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో(Social) ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి. డాన్సులు, రోమాన్సులు, ఫైట్లు, అప్పుడప్పుడు ముద్దుముచ్చట్లు.. ఇలా అనేక వీడియోలు వైరల్(Viral videos) అయ్యాయి. వీటిలో కొన్ని అభ్యంతరకంగా, అశ్లీలంగా కూడా ఉంటున్నాయి. ఇవన్నీ గమనించిన ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) చీఫ్ వికాస్ కుమార్(Vikas Kumar) ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇక ముందు ఇలాంటి వీడియోలు తీసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీడియో మేకింగ్ ఘటనలను నివారించడానికి ఓ బృందం మెట్రోలో(Metro) ఆకస్మిక తనఖీలు నిర్వహిస్తుందని తెలిపారు.
అభ్యంతరకర వీడియోలు తీస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలన్న కోరికతోనో, తొందరగా గుర్తింపు పొందాలన్న తాపత్రయంతోనో చాలా మంది మెట్రో లోపల వీడియోలు షూట్ చేస్తుంటారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వీడియోలే చాల వేగంగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా అరకొర బట్టలు వేసుకుని యువతులు చేసే వీడియోలకు బోల్డంత క్రేజ్ ఉంటోంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు తోటి ప్రయాణికులు చూసీ చూడనట్టు ఉండకుండా మెట్రో అధికారులకు ఫిర్యాదు చేయాలని వికాస్‌కుమర్ విజ్ఞప్తి చేశారు.