లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Election 2024) చాలా పార్టీలు చాలా మంది సిట్టింగ్‌లకు మొండి చేయి చూపించాయి. అలాగే తమిళనాడులో(Tamilnadu) మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీ కూడా అదే చేసింది. సిట్టింగ్‌ ఎంపీ గణేశమూర్తికి(MP Ganesha murthy) టికెట్‌ ఇవ్వలేదు. దాంతో ఆయన మనస్తాపం చెందారు.

లోక్‌సభ ఎన్నికల్లో(Lok sabha Election 2024) చాలా పార్టీలు చాలా మంది సిట్టింగ్‌లకు మొండి చేయి చూపించాయి. అలాగే తమిళనాడులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK) పార్టీ కూడా అదే చేసింది. సిట్టింగ్‌ ఎంపీ గణేశమూర్తికి(MP Ganesha murthy) టికెట్‌ ఇవ్వలేదు. దాంతో ఆయన మనస్తాపం చెందారు. పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం(Suicide Attempt) చేశారు. సకాలంలో ఆయనను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అయినప్పటికీ మృత్యువు మాత్రం ఆయనను తన వెంట తీసుకెళ్లింది. గురువారం ఉదయం ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలోనే చనిపోయారు. మార్చి 24వ తేదీన గణేశమూర్తి ఆత్మహత్య ప్రయత్నం చేశారు. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. డీఎంకే పార్టీతో పొత్తులో భాగంగా ఈసారి ఈరోడ్ లోక్‌సభ ఎంపీ టికెట్ కేటాయించక పోవడంతో ఎంపీ గణేశమూర్తి మనస్తాపం చెందారు. పురుగుల మందు తాగారు. అపస్మారక స్థితికి చేరుకున్న గణేశమూర్తిని కుటుంబ సభ్యులు స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షల అనంతరం ఎంపీని ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కోయంబత్తూరులోని ప్రై‍వేట్‌ ఆస్పత్రికి తరలించారు. గణేశమూర్తి మృతి వార్త తెలియగానే అనుచరులు స్థానికంగా బంద్‌కు పిలుపు ఇచ్చారు.

Updated On 28 March 2024 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story