ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో(Tamil Industry) వెలుగు వెలిగారు హీరో విజయ్ కాంత్(Hero Vijaykanth). ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన ఆయన.. లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అంతే కాదు డీఎండీకే(DMDK) పేరుతో పార్టీని స్థాపించి.. ప్రజాసేవ కూడా చేశారు. కాని కెప్టెన్ ను అనారోగ్యం చాలా కాలంగా వేదిస్తూ వస్తోంది. చాలా ఏళ్లుగా ఆయన ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉన్నారు.అంతే కాదు కోన్ని సార్లు ప్రాణాపాయం వరకూ వెళ్లి మళ్ళీ ఊపిరి పోసుకున్నాడు విజయ్ కాంత్.

DMDK Vijayakanth

తాజాగా మరోసారి ఆయన హాస్పిటలైజ్ అయ్యి.. విషమపరిస్థితిని ఎదుర్కొన్నారు. కొన్ని సోషల్ మీడియా(Social media) సంస్థలు అయితే.. ఆయన మరణించారని సంతాపం కూడా తెలిపాయి. కాని చావుని జయించికెప్టెన్ మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చారు. తాజాగా విజయ్ కాంత్ కుసబంధించిన వీడియోలు కొన్ని వైరల్ అవుతున్నాయి. పబ్లిక్ మీటింగ్ కు(Public Meeting) తన ఫ్యామిలీతో పాటు కార్యకర్తల సహాయంతో వచ్చారు విజయ్. ఆయన అసలు మనుషులను గుర్తు పట్టే పరిస్థితుల్లో లేరు. డీఎండీకే పార్టీ జనరల్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిక్కిశల్యమై కనిపించిన విజయకాంత్‌ను చూసి అందరూ షాకయ్యారు.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.విజయకాంత్‌య అనారోగ్యం.. మరియు ఆయన పరిస్థితి బాగోలేకపోవడంతో.. డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీగా.. ఆయన భార్య ప్రేమలత(Premalatha) విజయకాంత్‌ను నియమించారు. తాజాగా జరిగిన పార్టీ జనరల్ కమిటీ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ సమావేశానికి విజయ్ కాంత్ ను వీల్ చైర్ లో తీసుకువచ్చారు. ఆయన నిలబడే స్థితిలో లేరు. కుర్చీకే పరిమితమయ్యారు.
కనీసం చేతులు కూడా పైకి లేపి అభివాదం చేసే పరిస్థితి లేదు. దాంతో కార్యకర్తలు... ఆయన చేతులకుసపోర్ట్ ఇచ్చి..పైకి లేపి విజయ సంకేతం చూపించారు. ఇక విజయ్ కాంత్ కుతమిళనాట విప్లవ నాయకుడిగా పేరుంది. అటువంటిది ఆయన్ను ఇలా చూసిన అభిమానులు.. పార్టీ కార్యకర్తలు కన్నీటిపర్యంతం అవుతున్నారు. బోరున విలపిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.