ఈమధ్యే కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు తమిళ స్టార్ సీనియర్ హీరో(Vijaykanth).. విజయ్ కాంత్. కార్యకర్తల సమావేశంలో(Meetings) కూడా పాల్గొన్నారు. అయితే ఆయన్ను చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో బాధపడ్డారు.
ఈమధ్యే కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్చ్ అయ్యారు తమిళ స్టార్ సీనియర్ హీరో(Vijaykanth).. విజయ్ కాంత్. కార్యకర్తల సమావేశంలో(Meetings) కూడా పాల్గొన్నారు. అయితే ఆయన్ను చూసి ఫ్యాన్స్, ఆడియన్స్ ఎంతో బాధపడ్డారు. తమ అభిమాన తార ఇలా అయిపోయాడేంటి అని కుమిలిపోయారు. విజయ్ కాంత్ కూడా బక్క చిక్కిపోయి.. గుర్తుపట్టకుండా అయిపోయాడు. చేయి కూడా పైకి లేపలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే..ఆయన డిశ్చార్చ్ అయి నెలరోజులు కూడా గడవక ముందు మళ్లీ హాస్పిటల్(Hospital) లో జాయిన్ అయినట్టుతెలుస్తోంది.
అవును విజయ్ కాంత్ మళ్లీ హాస్పిటల్ లో చేరారట. విజయ్ కాంత్ కు మళ్ళీ అనారోగ్యం(Health Problems) ఇబ్బంది పెట్టడంతో ఆయన హాస్పిటల్ కు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఫ్యామిలీ మాత్రం మరో విధంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆయన రెగ్యూలర్ చెకప్ కోసమే ఇలా.. హాస్పిటల్ కు వచ్చారని. అంతే కాని ఆయనకు ఎటువంటి అనారోగ్యం లేదు అంటున్నారు. మరి ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.
తమిళనాట ఒకప్పుడు ఎంతో మంది అభిమానులను పొందిన హీరో విజయ్ కాంత్. ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ప్రాణం పోశారు. లక్షల మంది అభిమానులను సంపాదించాడు. ఇక సినిమాలు వదిలి.. ప్రజా జీవితంలోకి వచ్చిన ఆయన డీఎండీకేను స్థాపించారు. ఇక చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విజయ్ కాంత్. అప్పుడప్పుడు ఆయన ఆరోగ్యం విషయం అవ్వడం.. తరువాత కోలుకోవడం జరుగుతూనే ఉంది. ఇక తాజాగా మరోసారి విజయ్ కాంత్ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరినట్టు తెలుస్తోంది.