క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌కు మెజారిటీ వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ సీఎం అభ్య‌ర్ధి ఎంపిక‌పై క‌స‌ర‌త్తులు చేస్తుంది. సీఎం రేసులో మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌, కేసీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్ ఉన్నారు. అయితే.. పార్టీ కార్యకర్తలు మాత్రం రెండు శిబిరాలుగా విడిపోయారు. ఒకటి డీకే శివకుమార్ వ‌ర్గం.. మరొకటి మాజీ సీఎం సిద్ధరామయ్య వ‌ర్గం. ఈ నేప‌థ్యంలో సీఎం విషయంలో ఇరు వ‌ర్గాల మధ్య ప్లెక్సీ వార్ మొదలైంది.

క‌ర్ణాట‌క‌(Karnataka)లో కాంగ్రెస్‌(Congress)కు మెజారిటీ వ‌చ్చింది. దీంతో ఇప్పుడు ఆ పార్టీ సీఎం అభ్య‌ర్ధి ఎంపిక‌పై క‌స‌ర‌త్తులు చేస్తుంది. సీఎం రేసులో మాజీ సీఎం సిద్ధ‌రామ‌య్య‌(siddharamaiah), కేసీసీసీ అధ్య‌క్షుడు డీకే శివ‌కుమార్(DK Shivakumar) ఉన్నారు. అయితే.. పార్టీ కార్యకర్తలు మాత్రం రెండు శిబిరాలుగా విడిపోయారు. ఒకటి డీకే శివకుమార్ వ‌ర్గం.. మరొకటి మాజీ సీఎం సిద్ధరామయ్య వ‌ర్గం. ఈ నేప‌థ్యంలో సీఎం విషయంలో ఇరు వ‌ర్గాల మధ్య ప్లెక్సీ వార్(Flexi War) మొదలైంది.

కర్ణాటకలో కాంగ్రెస్ సీఎంను ఖరారు చేయక ముందే.. సిద్ధరామయ్య మద్దతుదారులు బెంగళూరులోని ఆయన నివాసం వెలుపల 'కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రి'గా అభివర్ణిస్తూ పోస్టర్‌ను వేశారు.

కర్ణాటక ప్ర‌దేశ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారులు బెంగళూరు(Bengaluru)లోని ఆయన నివాసం వెలుపల ఆయనను రాష్ట్ర తదుపరి సీఎంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్లెక్సీని ఏర్పాటుచేశారు. కాంగ్రెస్‌ను గెలిపించడానికి క‌ష్ట‌ప‌డింది డీకే శివకుమార్ అని ఆయ‌న‌ మద్దతుదారులు అంటున్నారు. ఇరువ‌ర్గాల మ‌ధ్య వార్ ఆపాలంటే.. కాంగ్రెస్ అధిష్టానం క‌లుగ‌జేసుకుని సీఎం అభ్య‌ర్ధిని ప్ర‌క‌టించ‌డం ఇక్క‌టే మార్గం.

Updated On 14 May 2023 12:18 AM GMT
Yagnik

Yagnik

Next Story