కర్ణాటక(Karnataka) వ్యవహారంపై కాంగ్రెస్(Congress) అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా(cheif minister) ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కొందరు సిద్ధరామయ్యకే(Siddaramaiah) అవకాశాలున్నాయని అంటుంటే, మరికొందరు డీకే శివకుమార్‌కు(DK Shiva Kumar) పట్టం కట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
కర్ణాటక(Karnataka) వ్యవహారంపై కాంగ్రెస్(Congress) అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రిగా(cheif minister) ఎవరిని ఎంపిక చేస్తుందన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. కొందరు సిద్ధరామయ్యకే(Siddaramaiah) అవకాశాలున్నాయని అంటుంటే, మరికొందరు డీకే శివకుమార్‌కు(DK Shiva Kumar) పట్టం కట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పీసీసీ(PCC) చీఫ్ డీకే శివకుమార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని చెప్పుకొచ్చారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే అన్నారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు అసలు చేయనని అన్నారు.
గాంధీ(Gandhi) కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు డీకే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి 20 స్థానాలను గెలిపించి ఇవ్వడమే తమ ముందున్న సవాల్ అని డీకే అన్నారు. చరిత్రలో తన గురించి తప్పుగా చెప్పుకోవడాన్ని తాను కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు. డీకే వ్యాఖ్యలతో సిద్ధరామయ్య వర్గానికి టెన్షన్ తగ్గింది. ఇదిలా ఉంటే ఇవాళ సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. కొందరు మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేయనున్నారు. . ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.