కర్ణాటక(Karnataka) సీఎం పదవిపై నెల‌కొన్న ఉత్కంఠ వీడింది. నాలుగు రోజుల హైడ్రామా తర్వాత సిద్ధరామయ్యకు సీఎం, డీకే శివకుమార్‌కు(DK Shiva kummar) డిప్యూటీ సీఎం ప‌గ్గాలు అప్ప‌గిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్(Congress) అధిష్టానం. డీకే శివకుమార్ సీఎం ప‌ద‌వి కావాలని పట్టుదలతో ఉన్నా

కర్ణాటక(Karnataka) సీఎం పదవిపై నెల‌కొన్న ఉత్కంఠ వీడింది. నాలుగు రోజుల హైడ్రామా తర్వాత సిద్ధరామయ్యకు సీఎం, డీకే శివకుమార్‌కు(DK Shiva kummar) డిప్యూటీ సీఎం ప‌గ్గాలు అప్ప‌గిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్(Congress) అధిష్టానం. డీకే శివకుమార్ సీఎం ప‌ద‌వి కావాలని పట్టుదలతో ఉన్నా.. చివరకు కాంగ్రెస్ హైకమాండ్ మాటకు కట్టుబడి డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించారు. కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించారు. సీఎం పదవిని పొందడం ద్వారా విజ‌యం తాలూక‌ ఫలాలను పొందాలని భావించారు. అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, పార్టీ హైకమాండ్ ఉద్దేశాలు భిన్నంగా ఉన్నాయి. అందుకే డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

డీకే శివకుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా డిప్యూటీ సీఎం పదవిని చేప‌ట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కర్ణాటక ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి నిబద్ధత ఉందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్నాయని, ఏఐసీసీ అధ్యక్షుడు, గాంధీ కుటుంబీకుల మాట తప్పకుండా వినాలని డీకే అన్నారు.

శివకుమార్ సోదరుడు డీకే సురేష్ మాట్లాడుతూ.. "నేను పూర్తిగా సంతోషంగా లేను, కానీ కర్ణాటక ప్రయోజనాల దృష్ట్యా మా కమిట్‌మెంట్‌ను నెరవేర్చాలనుకుంటున్నాము.. కాబ‌ట్టి శివకుమార్ దానిని అంగీకరించవలసి వచ్చింది.. చాలా దూరం వెళ్ళాలి.. మేము భవిష్యత్తులో ప‌ద‌వుల‌ను చూస్తామని అన్నారు.

Updated On 18 May 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story