గద్వాల(Gadhwal) మండలం చెనుగొనిపల్లి(chenugolupalli) గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది.

DK Shiva Kumma
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(karnataka Assembly Elections) ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్(Congress) పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని ఎవరిని చేయాలా అన్నదానిపై తలమునకలయ్యింది. మూడు రోజుల చర్చల తర్వాత మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యవైపు మొగ్గు చూపింది. సాయంత్రం ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Malikarjuna Kharge) సిద్ధరామయ్య పేరును అధికారికంగా ప్రకటిస్తారు.
ముఖ్యమంత్రి పదవిని కోరుకున్న డీకే శివకుమార్(DK Shiva kummar) తన తమ్ముడితో కలిసి కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. ఆయన మద్దతుదారులేమో నివాసం బయట నిరసనకు దిగారు. డీకేకు సీఎం పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దత్త పుత్రుడు కావాలా? అసలు పుత్రుడు కావాలా? అంటూ డికే శివకుమార్‌ను సీఎం చేయాలంటూ నినాదాలు చేశారు వాళ్లు. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించి, పార్టీకి ఘన విజయాన్ని సాధించి పెట్టి, సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడానికి కారణమైన డీకేకే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. డీకేకు కాకుండా ఇంకెవ్వరికి ఆ పదవి ఇచ్చినా ఆ నిర్ణయం చారిత్రక తప్పిదమే అవుతుందని కామెంట్ చేశారు.
