ఒక్కొసారి కొన్ని సంఘటనలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది..అంతేకాదు ఇది ఎలా సాధ్యం అనే అనుమానాలు కూడా మన అందరిలోనూ కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులైతే(family members) ఏకంగా షాక్ కి గురి అవుతారు. అయితే ఇలాంటి ఓ సంఘటన ఒకటి గుజరాత్ (Gujarat) లో జరిగింది. వివాహ బంధంతో ఒకటైన దంపతులకు ఎంత ప్రయత్నించినా సంతానం కలగకపోవడంతో ...తమ పదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు. తర్వాత అసలు ట్విస్ట్ ఏమిటంటే

ఒక్కొసారి కొన్ని సంఘటనలు వింటే చాలా ఆశ్చర్యం వేస్తోంది..అంతేకాదు ఇది ఎలా సాధ్యం అనే అనుమానాలు కూడా మన అందరిలోనూ కలుగుతాయి. ఇక కుటుంబ సభ్యులైతే(family members) ఏకంగా షాక్ కి గురి అవుతారు. అయితే ఇలాంటి ఓ సంఘటన ఒకటి గుజరాత్ (Gujarat) లో జరిగింది. వివాహ బంధంతో ఒకటైన దంపతులకు ఎంత ప్రయత్నించినా సంతానం కలగకపోవడంతో ...తమ పదేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి విడాకులు తీసుకున్నారు. తర్వాత అసలు ట్విస్ట్ ఏమిటంటే విడాకుల తర్వాత ఆమె ప్రెగ్నెంట్ ( Pregnant)అయ్యింది వింటుంటే .ఇది ఎక్కడో తేడా కొడుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఇంతకీ ఈ ట్విస్ట్ ఏంటో దీనికి సంబంధించిన వివరాలు ఏంటో చూద్దాం.

గుజరాత్ లోని( Gujarat ) వడోదర ప్రాంతానికి చెందిన ఓ బాధితురాలు అభయం హెల్ప్ లైన్ నెంబర్ 181 కు ఫోన్ చేసి.తాను విడాకుల( Divorce ) తర్వాత ప్రెగ్నెంట్ అయ్యానని తనకు సహాయం చేయాలని కోరింది. ఆ మాటకు ఒక్కసారిగా షాక్ అయినా అభయం టీం విడాకుల తర్వాత ప్రెగ్నెంట్ ( Pregnant)ఎలా అయ్యారు అని ప్రశ్నించింది. అందుకు ఆ బాధితురాలు విడాకులు తీసుకున్న తర్వాత తన భర్త ( Husband ) తన వద్దకు తరచూ వస్తూ ఉండేవాడని, తనతో శారీరక సంబంధం కొనసాగించేవాడని తెలిపింది. ఈ క్రమంలో తాను ప్రెగ్నెంట్ అయ్యానని తెలిపింది . అయితే ఈ విషయం భర్తకు చెప్పడంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడని తెలిపింది. ఆమె ఎంత బతిమాలిన కూడా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తాను తండ్రిని కాదు అనడంతో తాను హెల్ప్ లైన్ సహాయం కోరానని తెలిపింది.

అయితే అభయం టీమ్ బాధితురాలు భర్తతో మాట్లాడితే....విడాకులు( Divorce) తీసుకున్న తర్వాత తనకు ఎటువంటి సంబంధం, ఎటువంటి బాధ్యత లేదని మొండిగా వాదించాడు. దీంతో అభయం టీం బాధితురాలిని కర్జాన్ పోలీస్ స్టేషన్ (police station)కు తీసుకువెళ్లి పంచాయతీ పెట్టింది. అయితే పోలీస్ స్టేషన్లో బాధితురాలు, తమ బంధువులతో రహస్యంగా మాట్లాడుకుని చివరకు తామే ఈ మ్మాటర్ ను సెటిల్ చేసుకుంటామని పోలీసులకు తెలిపారు. చివరకు పోలీసులు మీ ఇష్టం అంటూ కేసు నమోదు చేయలేదు. ఏదైతేనేం ఈ ఘటన స్థానికంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Updated On 25 April 2023 6:22 AM GMT
madhuri p

madhuri p

Next Story